జయలలిత దివంగతురాలై సంవత్సరం అవుతున్న తను చనిపోవడానికి గల కారణాలపై ఇంకా చర్చ కొనసాగుతుంది , అయితే జయలలిత మరణానికి గల కారణం పై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆరుముగన్కు కొత్త నిజాలు వెలుగులోకి తెచ్చారు.జయలలిత చనిపోవడానికి ముందు ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చారు అని అమ్మకి ఇంట్లో వైద్యం చేసిన ఆక్యుపంక్చర్ నిపుణుడు డాక్టర్ శంకర్ తేలిపారు.” గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి జయలలిత అస్వస్థతకు గురైన వెంటనే ప్రాథమిక చికిత్సలందించారు. ఇదే సందర్భంగా ఆమెకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్లు గుర్తించాం’’ అని శంకర్ చెప్పినట్లు తెలిసింది.