ఈ రోజుల్లో సినిమాలు తీయడంలో ఉన్న ప్యాషన్ దాన్ని ప్రమోట్ చేసుకుని.. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి అనే విషయంపై మాత్రం లేదు. చాలా మంది ఏదో తమకు తెలిసిన కథను తిప్పితిప్పి తీసేస్తుంటారు. దాన్ని ఏదో ఓ టైమ్ రిలీజ్ చేస్తే సరిపోతుంది. అందుకే శుక్రవారం వచ్చిందంటే చాలు.. చిన్న నిర్మాతలు పండగ చేసుకుంటారు. ఈ వారం కూడా ఏకంగా 14 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. ఈ వారం వచ్చిన సినిమాల్లో యాంకర్ రవి హీరోగా అయోధ్య కార్తిక్ తెరకెక్కించిన చిత్రం ఇది మా ప్రేమకథ కాస్తో కూస్తో తెలిసిన సినిమా. ఈ సినిమా కూడా చాలా స్లోగా.. బోరింగ్ గా ఉందంటున్నారు ప్రేక్షకులు. రవికి సినిమాల కంటే టీవీనే కరెక్ట్ అంటున్నారు.
ఇక దు, శ్రీముఖి జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం.. నవీన్ చంద్ర, నివేదా థామస్ జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ లాంటి సినిమాలైతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. వీటిని చూడ్డానికి థియేటర్స్ కు ఎవరూ రాలేదు. వీటి పరిస్థితే ఇలా ఉంటే సీత రాముని కోసం.. రమ్యకృష్ణ మళయాల డబ్బింగ్ మాతంగి.. విక్రమ్ డబ్బింగ్ చిత్రం 10.. ప్రేమ పందెం.. మరో దృశ్యం.. ఉందా లేదా.. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్.. లచ్చి.. పడిపోయా నీ మాయలో.. తొలి పరిచయం.. మామ ఓ చందమామ.. ఇలా ఈ సినిమాలన్నీ వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇందులో చాలా సినిమాలు తొలిరోజు థియేటర్స్ లో ప్రేక్షకులు లేక.. మరో సినిమాలతో కవర్ చేసుకున్నారు థియేటర్ ఓనర్లు. అలా ఉంది మన చిన్న సినిమాల పరిస్థితి.