తెలుగు మహాసభను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే, తెలంగాణ ప్రభుత్వం ముఖ్య అతిదులని ఆహ్వానించగా పక్క రాష్ట్రం లో ఉన్న ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదు అయితే ఇదే విషయాన్ని ఒక్క విలేఖరి ఇలా ప్రశ్నించారు
‘‘తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సభలకు మిమ్మల్ని పిలవలేదు కదా! మీ కామెంట్ ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా… ‘‘నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు’ అని చంద్రబాబు జవాబు ఇచ్చి తన ఔన్నత్యం చాటుకున్నారు