ఈ మధ్య ప్రకాష్ రాజ్ రాజకీయాల పై తరచు ట్వీట్లు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీ గారిని విమర్శిస్తూ ట్వీట్ చేయగా దానికి పాటల రచయిత అనంత్ శ్రీరామ్ మరియు ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ కౌంటర్ వేశారు.. అనంతశ్రీరాం తన రచన శైలిలో చురకలు వేశారు ఇలా…
నేను మోనార్కుని
ఛి. ఋణ మాఫి చేయకుండా
ఓట్లు రాలడమేంటి
ఛి.ఛి.ఉచితం అని చెప్పకుండా
సీట్లు రావడమేంటి
ఛి.ఛి.ఛి. కులాల చంకనాకకుండా
పీఠమెక్కడమేంటి
నీదసలు గెలుపేనా
నన్ను నువ్వు గెలవలేవు
నిన్ను గెలిపించడంలో
నెనే గెలిచాను
కిందపడ్డా మీదపడ్డా నాదే గెలుపు
కారణం నా రంగు ఎరుపు
నాదారి ఎరుపు నాతీరు ఎరుపు
నాపేరు ఎరుపు నేనే పేహ్ ద్ద ఎరుపు
కాదంటావా ..నీకెంత బలుపు …
కాస్కో కళ్ళకి ఎర్రద్దాలు పెట్టుకొస్తా
అవసరమైతే ఎర్రగంతలు కట్టుకొస్తా
అప్పుడు ఒక్క నీ కాషాయమేంటి
పచ్చ-పసుపు గులాబీ-తెలుపు
నీలం-నలుపు అన్నీ నాదృష్టిలో ఎరుపు
కపడ్దార్
నేను మోనార్కుని
నన్నెవ్వడూ మోసం చెయ్యలేడు ….
ఇంక మధుర శ్రీధర్ విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ ను మరింత ఘాటుగా విమర్శించారాయన..
నీ గోల ఎంటో అస్సలు అర్దం కావట్లెదు! నువ్వు ప్రొడ్యూసర్స్ ను డైరెక్టర్స్ ను ఇబ్బంది పెదుతుంటావు కదా నీ అహాంకారం తొ. నువ్వు సంతొషం గా ఉన్నావా ? Don’t just try to make headlines! Work on a genuine cause & make an impact as leader. Then u comment & we will take u seriously @ప్రకాష్‌రాజ్. ఇది చూసి మరి ప్రకాష్ రాజ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి.