2G స్కాం జరగకుంటే … 1.7 లక్షల కోట్లు ఎవరు తిన్నారు ?

2G స్కాం మేము పదవి లోకి వస్తే నిగ్గు తేలుస్తాం అని ప్రగల్బాలు పలికిన బీజేపీ వచ్చినా నిర్దోషులు అని తీర్పు వచ్చినా ఏమి చేయలేక పోతున్నారు. ప్రజలని ఎర్రి పప్పల్ని చేసిన కాంగ్రెస్ బీజేపీ గోవెర్నెమెంట్ల పై ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అంటే ఈ మెసేజ్ చదవాల్సిందే…

1.7 లక్షల కోట్ల భారీ స్కాం అని కాగ్ ఆరోపించింది. సీబీఐ, ఈడీ దర్యాఫ్తు చేసి రూ.30,984 కోట్ల మేర స్కాం జరిగినట్టు కోర్ట్ కి తెలిపింది… కాని కోర్ట్, సరైన ఆధారాలు లేవు అని, స్కాంలో ఎవరూ నిందుతులు కాదు అని సింగల్ లైన్ లో తీర్పు ఇచ్చింది… మరి, ఆ 1.7 లక్షల కోట్లు ఎవరు తిన్నారు ? వారు దోషులు కాకపొతే, మరి దోషులు ఎవరు ? అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లూటి చేసింది అని ఆరోపించిన బీజేపీ పార్టీ ఇవాళ అధికారంలో ఉండి కూడా, తన చేతిలో సిబిఐని ఉంచుకుని కూడా సరైన ఆధారాలు ఎందుకు చూపించలేదు ? ఎందుకు ప్రూవ్ చెయ్యలేక పోయింది ? ఇంతకీ స్కాం అని జరిగిందా ? ఇవాళ తీర్పుని బట్టి చుస్తే, అసలు 2జీ స్కాం జరగనేలేదు అనే భావన వ్యక్తం అవుతుంది ? మరి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు ? 1.7 లక్షల కోట్ల భారీ స్కాంలో, ఒక్కరు కూడా దొంగ కాదా ? ఒక్క ఆధారం కూడా సిబిఐ చూపించలేదా ?

తరువాత బొగ్గు కుంబకోణం, కామన్ వెల్త్ స్కాం, గాలి జనార్ధన రెడ్డి స్కాం, జగన్ దోపిడీ, ఇవి కూడా జరగలేదు అని చెప్తారా ? ఒక్క కేసు కూడా కేంద్ర ప్రభుత్వం నిరూపించలేదా ? దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో దోషులు ఇంటికి వెళ్లి, ప్రధాన స్థాయి వ్యక్తి వాళ్ళతో గడిపి, ఈ దేశానికి ఏ సంకేతం ఇస్తున్నారు ? ఇదేనా మీరు చేసే అవినీతి మీద పోరాటం ?

ఎవరూ దోషులు కానప్పుడు, ఎవరూ స్కాం చేయ్యినప్పుడు, 2012 ఫిబ్రవరిలో అపెక్స్ కోర్ట్, 122 టెలికాం లైసెన్స్ లు ఎందుకు రద్దు చేసింది ? 9 కంపెనీలకు అలాట్ చేసిన స్పెక్ట్రమ్ లు ఎందుకు రద్దు చేసింది ? ఏ స్కాం జరగపోతే అప్పుడు ఇలా ఎందుకు జరిగింది ? ఇప్పుడు మళ్ళీ హై కోర్ట్ అని, సుప్రీమ్ కోర్ట్ అని, ఈ కేసు తేలే సరికి, 10జి యుగంలో ఉంటాం అంటే ఆశ్చర్యం కాదు ఏమో… ఎవరిని నిందించాలి ? రాజకీయ నాయకులనా ? సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలనా ? కోర్ట్ లనా ? వ్యవస్థనా ? లేక న్యాయం కోసం ఎదురు చూసే ఈ దేశపు పిచ్చి జనాలనా ? చూస్తా ఉంటే అందరూ మంచి వారే… న్యాయం కోసం చూసే జనాలే పిచ్చి వారు… సెల్యూట్ టు మై కంట్రీ… జై హింద్… అని ఒక్క వాట్స్ అప్ లో ఫార్వర్డ్ మెసేజ్ వైరల్ అవుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here