మ్యాజిక్ జరుగుతున్నపుడు మనకు తెలియకుండానే దానికి కనెక్ట్ అయిపోతాం. ఎక్కడ రెప్ప వేస్తే మిస్ అయిపోతామేమో అనే మాయలో ఉంటాం. వెండితెరపై ఇలాంటి మ్యాజిక్కే చేస్తున్నాడు విక్రమ్ కే కుమార్. ఈయన తన సినిమాలతో ప్రేక్షకుల్ని మాయ చేస్తున్నాడు. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ దర్శకుడు.. ఇష్క్ వరకు ఎవరికీ తెలియదు. 13 బి సినిమా హిట్టైనా కూడా పట్టించుకోలేదు. ఇష్క్ తర్వాత విక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన సినిమా అంటే ఇప్పుడు మ్యాజిక్ అంతే. కొత్త కథలు ఉన్నపుడు.. అద్భుతమైన క్యాస్టింగ్ ఉన్నపుడు.. ఎవరైనా సినిమాలు చేస్తారు. కానీ కథ పాతదే ఉండి.. కొత్త వాళ్లతో సినిమా చేయాల్సి వచ్చినపుడే ఆ దర్శకుడి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఈ విషయంలో విక్రమ్ కే కుమార్ తోపు. ఈ దర్శకుడు సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ఈయన సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు హలోలో కూడా అది కనిపించింది. కథ తెలిసిందే. మనసంతా నువ్వేను మార్చి తీసాడు విక్రమ్. కానీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మాత్రం మామూలుగా లేదు. తెలిసిన కథనే అంత అందంగా చెప్పడం ఒక్క విక్రమ్ కే సాధ్యమయ్యిందేమో మరి..! అఖిల్, కళ్యాణి మధ్య వచ్చిన సీన్స్ కానీ.. రమ్యకృష్ణ, అఖిల్ మధ్య వచ్చే సీన్స్ కానీ రీ ఫ్రెషింగ్ గా అనిపించాయి. దానికితోడు స్క్రీన్ ప్లే మ్యాజిక్ విక్రమ్ ఆయుధం. హలో లాంటి క్యూట్ లవ్ స్టోరీలోకి మొబైల్ మాఫియా తీసుకొచ్చి యాక్షన్ జోడించడం అనేది నిజంగా విక్రమ్ కే కుమార్ ఆలోచనలకు సెల్యూట్ చేయాల్సిందే. మొత్తానికి విక్రమ్ వెండితెర మాంత్రికుడు అయిపోయాడు.