మోహన్ బాబు.. ఈ పేరుకు తెలుగులో ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమా అంటే ఇప్పటికీ ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. కాకపోతే ఏమైందో కానీ ఈ మధ్య కానీ వరసగా సినిమాలు చేయడం లేదు మోహన్ బాబు. చాలా రోజుల తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా గాయత్రి. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది చూస్తుంటే వామ్మో.. ఏంటా కళ్లలో కసి అనిపించక మానదు. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు కచ్చితంగా పెంచేస్తుంది. మోహన్ బాబు 42 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంబి 42 అనేది పోస్టర్ పై రిప్రజెంట్ చేసారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసారు. పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకుడు. ఒకప్పుడు తాను చేసిన అసెంబ్లీ రౌడీ తరహా స్క్రిప్ట్ ఇదని చెబుతున్నాడు మోహన్ బాబు.
ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు చాలా ఇంటెన్స్ ఉన్న లుక్ లో కనిపించాడు. మాసిన గడ్డం.. రఫ్ లుక్.. ఫేస్ లో ఆ కోపం చూస్తుంటే ఎవరిమీదో బాగా పగ పట్టేసినట్లు తెలుస్తుంది. ఇది రివేంజ్ డ్రామా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇందులో విష్ణు కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే యాంకర్ అనసూయ ఇందులో కీలకపాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఇదంతా చూస్తే గాయత్రి ఏదో అల్లాటప్పాగా వస్తున్నట్లు కనిపించట్లేదు. ఈ సినిమా తనకు సెకండ్ ఇన్నింగ్స్ గా మారుతుందని ఆశిస్తున్నాడు మోహన్ బాబు. ఫిబ్రవరి 9న గాయత్రి విడుదల కానుంది. మరి చూడాలిక.. మోహన్ బాబు కోపానికి కారణం ఎవరో..?