మన బలంతో పాటు బలహీనతలు కూడా తెలిసినపుడే జీవితంలో పైకి వస్తాం. అది తెలుసుకోకపోతే అలాగే మిగిలిపోతాం. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇది తెలియకే కెరీర్ తొలి నాళ్లలోనే ముగింపుకు వచ్చేస్తారు. స్వయంగా అక్కినేని నాగేశ్వరరావ్ అంతటి నటుడే ఎన్టీఆర్ తో పోటీ పడకుండా తాను కేవలం భక్తుడి వేషాలకే సరిపోతానని తనను తాను తక్కువ చేసుకున్నాడు. కాబట్టే అంత గొప్ప నటుడయ్యాడు. నటుడిగా తమకు తెలిసి ఉండాలి.. తాము ఏ పాత్రలకు సూట్ అవుతాం అని. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే రానా ఇది తెలుసుకున్నాడు. అందుకే కమర్షియల్ రూట్ అంటూ వాటిచుట్టూ తిరక్కుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు అల్లు శిరీష్ కూడా ఇదే రూట్ లో వెళ్తున్నాడు. మెగా హీరోల్లా మాస్ ఇమేజ్ మాత్రం అల్లు శిరీష్ కు ఊహించడం కష్టమే. అది తనకు రాదని కూడా ఈ హీరోకు బాగా తెలుసు.
అందుకే తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు వారబ్బాయి. మాస్ కథలు.. కమర్షియల్ సినిమాలు అంటూ తన అన్న, బావలా లెక్కలేసుకోకుండా సింపుల్ గా తనకు నచ్చిన కథల్ని ఎంచుకుంటున్నాడు శిరీష్. ఈయన ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ తో ఓ సినిమా చేసాడు. అదే ఒక్కక్షణం. తాజాగా ఈ చిత్రం విడుదలైంది. ఇది చూసిన తర్వాత శిరీష్ వెళ్తోన్న దారి ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది మనకు. ట్రైలర్ తోనే సినిమా ఎంత కొత్తగా ఉంటుందో చూపించిన ఈ హీరో.. ఇప్పుడు సినిమాతోనూ ఇదే చేసాడు. ఒక్కక్షణం నిజం గానే కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత ఓ బై లింగువల్ సినిమాకు ఓకే చెప్పాడు శిరీష్. ఇది కూడా రొటీన్ కథ కాదు. మొత్తానికి రానా తరహాలో తన బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే కథలతో ముందుకెళ్తున్నాడు శిరీష్. ఇదే దారిలో సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు.