సుబ్రమణ్య స్వామి.. కేరాఫ్ బిజేపి. ఈయన పేరు వింటే వివాదాలు ముందు గుర్తొస్తాయి. ఈయన చేసిన సేవలేంటో తెలియదు కానీ కేవలం వివాదా స్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో ఉంటాడు ఈయన. తాజాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన గంటల్లోనే ఈయన నోరు పారేసుకున్నారు. అసలు రజినీకాంత్ కు ఏం తెలుసు రాజకీయాల గురించి.. ఆయనకు చదువు సంధ్య లేదన్నాడు స్వామి. ఆయన ఇంక ప్రజలకేం మంచి చెప్తాడు చేస్తాడంటున్నాడు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావటం తమిళనాడుకు కొత్తేమీ కాదని.. పాత కథేనన్నారీయన. అసలు తమిళ రాజకీయాల నుంచి సినిమా వాళ్లను వెలేసినప్పుడే తమిళనాడు ప్రతిష్ఠ పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు సుబ్రమణ్య స్వామి. రజనీకాంత్ ఓ నిరక్ష రాస్యుడన్నాడు ఈయన. మీడియా హడావుడి తప్ప మరేమీ లేదని తేల్చేసిన స్వామి.. ఇప్పటికి రజనీ తన పార్టీ పేరేంతో ప్రకటించలేదన్నారు. మరోవైపు స్వామి వ్యాఖ్యలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం చదువుకున్న వాళ్లు మాత్రమే రాజకీయాలకు అర్హులైతే బిజేపీలో ఎంత మంది చదువుకున్న వాళ్లున్నారు.. అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రాజకీయ అరంగేట్రం గురించి ఇలా చెప్పాడో లేదో అప్పుడే రజినీపై విమర్శలు మొదలైపోయాయి. ఇక ఇప్పట్నుంచి ఈయన కూడా తీసుకోడానికి రెడీగా ఉండాలేమో మరి..?