అదే్ంటి.. రాజకీయాల్లోకి రానేలేదు అప్పుడే రాజీనామా ఏంటి అనుకుంటున్నారా..? ఎప్పట్నుంచో రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తి అభిమా నుల్లో.. ప్రేక్షకుల్లో రగిలిస్తూనే ఉన్నారు రజినీకాంత్. ఇప్పుడు ఆయన వస్తున్నానని కన్ఫర్మ్ చేసాడు. మరి మిగిలిన వాళ్ళతో ఆయనకు ఏదో ఓ తేడా ఉండాలి కదా..? అందుకే వస్తూ వస్తూనే ఛాలెంజ్ చేసారు రజినీకాంత్. తాను పార్టీ పెట్టిన తర్వాత అధికారం వస్తే మూడేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పారు రజినీ. అలా కాని పక్షంలో రాజీనామా చేస్తానని సవాల్ చేసారు. ఇలాంటి రాజకీయ అరంగేట్రం మాత్రం ఎక్కడా వినలేదు. ఇదే రజినీ గొప్పతనం కూడా. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని చెప్పాడు రజినీ. అది కూడా 234 స్థానాలకు. అంటే సిఎం కుర్చీపైనే కన్నేసాడు రజినీకాంత్. తాను పార్టీ పెట్టేది డబ్బు కోసం కాదని.. మంచి పాలన కోసం అని చెప్పాడు రజినీ. ఒకవేళ తాను అనుకున్నది కానీ చేయకపోతే.. ఇచ్చిన మాట తప్పితే మూడేళ్లలో రాజీనామా చేస్తానని సవాల్ చేసాడు సూపర్ స్టార్.
రజినీకాంత్ కు కొన్నాళ్ల నుంచి రాజకీయాలపై మనసు బాగా పడినట్లుంది. అందుకే ఒప్పుకున్న సినిమాలను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు సూపర్ స్టార్. సాధారణంగా రజినీ సినిమా అంటే ఎప్పుడు మొదలై ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ ఉండదు. పైగా ఆయన్నుంచి ఒక్కో సినిమా రావాలంటే కనీసం రెండేళ్లైనా పడుతుందని ఫిక్సైపోయారు అభిమానులు. ఇలాంటి టైమ్ లో రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో రాబోతున్నారు సూపర్ స్టార్. ఈ దూకుడు రాజకీయాల కోసమే అని ఇప్పుడు అర్థమైంది. 2.0 ఎప్రిల్ 14న వస్తుంటే.. అదొచ్చిన రెండు నెలలకు కాలా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు సూపర్ స్టార్. మొత్తానికి కొత్త పార్టీతోనే వస్తున్నాడు రజినీకాంత్.. మరి ఈయన మరో ఎంజిఆర్ అవుతాడా.. లేదంటే విజయ్ కాంత్ అవుతాడా చూడాలిక..!