ఇండస్ట్రీలో మెగా హీరోల కన్ను.. దిల్ రాజు చేయి పడితే చాలు హీరోయిన్ల కెరీర్ సెటిలైపోయినట్లే. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కరుణించినా వరస ఆఫర్లు గ్యారెంటీ. ఇప్పుడు పూజాహెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈమెకు ఏ ఇండస్ట్రీ ఇప్పటి వరకు కలిసిరాలేదు. పూజా నటించిన ముకుందా.. ఒక లైలా కోసం.. డిజే.. ఏదీ హిట్ కాదు. కానీ పూజా మాత్రం తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. దానికి కారణం ఆమె అందాల ఆరబోత. డిజే యావరేజ్ గా ఆడినా.. ఆమె అందాల ఆరబోత మాత్రం సూపర్ హిట్టైంది. ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ సురేష్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న సాక్ష్యం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు భారీ సినిమాల్లోనూ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ రెండు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలోనే కావడం విశేషం. ఒకటి నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తోన్న శ్రీనివాస కళ్యాణం.. మరోటి వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న మహేశ్ 25వ సినిమా. ఈ రెండు సినిమాల్లోనూ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ రెండూ 2018లోనే తెరకెక్కనున్నాయి. సాక్ష్యం.. శ్రీనివాస కళ్యాణంతో పాటు మహేశ్ సినిమా కూడా హిట్టైతే పూజాహెగ్డే టాప్ స్టార్ కావడం విశేషం.