ఇప్పుడు ఎక్కడ విన్నా.. చూసినా ఒకటే చర్చ. అదే అజ్ఞాతవాసి.. ఈ చిత్రం తప్ప మరో ధ్యాసే లేదు ఇప్పుడు. ఒకటి రెండు కాదు ఏకంగా 3000 థియేటర్స్ లో జనవరి 10న విడుదల అవుతుంది అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేయడం ఖాయమైపోయింది. ఇక లెక్కలు మాత్రమే బ్యాలెన్స్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇందులో కీర్తిసురేష్, అను ఎమ్మాన్యువల్ హీరోయిన్లు. ఖష్బూ కీలకపాత్రలో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే అజ్ఞాతవాసి ఓ వారసుడి కథ. తనను తాను నిరరూపించుకోవాల్సిన ఓ వారసుడి కథ.. ఇందులో ఖుష్బూ పవన్ కు రెండో తల్లిగా నటించింది. ఇక రావు రమేష్ కూతురుగా కీర్తిసురేష్ నటించగా.. పవన్ కు పిఏగా అను ఎమ్మాన్యువల్ కనిపిస్తుంది. ఆది పినిశెట్టి ఇందులో మెయిన్ విలన్. ఈయన యంగ్ బిజినెస్ మ్యాన్ గా నటించాడు అజ్ఞాతవాసిలో. సినిమాలో ఈయన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. బోమన్ ఇరాని, రావు రమేష్, మురళీ శర్మ.. ఈ బ్యాచ్ పాత్రలన్నింటినీ అంతా ఒకప్పుడు నూతన్ ప్రసాద్, రావు గోపాలరావ్, అల్లు రామలింగయ్యలను గుర్తుకు తెచ్చేలా త్రివిక్రమ్ తీర్చిదిద్దాడని తెలుస్తుంది. మొత్తానికి సినిమా అంతా కామెడీ ఎక్కువగా ఉంటుందని.. అక్కడక్కడా మనసును కదిలించే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. మరి మొత్తానికి చూడాలిక.. అజ్ఞాతవాసి అరాచకం ఎలా ఉండబోతుందో..?