నాన్నకు ప్రేమతో సినిమాలో ఓ థియరీ ఉంటుంది. ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఓ ఇన్సిడెంట్ మరెక్కడో జరిగే ఇన్సిడెంట్ కు కనెక్ట్ అయి ఉంటుంది. అన్నీ ఇంటర్ లింక్ అని. ఇప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది రకుల్ ను చూస్తుంటే. ఈ భామ నటించిన సినిమా ఇప్పుడు మరో సినిమా కారణంగా పోస్ట్ పోన్ అయింది. అది కూడా సడన్ గా రేస్ లోకి రావడం వల్ల. అసలు విషయం ఏంటంటే.. రకుల్ నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుంది. అది కూడా అయ్యారీ లాంటి భారీ సినిమాతో. ఈ చిత్రానికి దర్శకుడు నీరజ్ పాండే. ఈయనకు ఇప్పటివరకు పరాజయం లేదు. దాంతో ఈ చిత్రంతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవచ్చని ఆశగా చూస్తుంది రకుల్. ఇప్పటికే అక్షయ్ కుమార్ సరసన కూడా నటించే అవకాశం అందుకుంది. ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు ఈమె నటించిన రీ ఎంట్రీ సినిమా అయ్యారీ వాయిదా పడింది.
ఈ చిత్రం జనవరి 26న విడుదల కావడం లేదు. ప్రమోషన్స్ కూడా బిజీబిజీగా చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సడన్ గా రేస్ లోకి వచ్చింది పద్మావత్. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. రన్ వీర్ సింగ్, దీపిక, షాహిద్ కపూర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉండటంతో పద్మావత్ తో పోటీ పడకపోవడమే మంచిదని ఫీలవుతున్నారు అయ్యారీ టీం. దానికితోడు జనవరి 26నే ప్యాడ్ మ్యాన్ కూడా విడుదల కానుంది. అసలే ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమాలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. ఆయనతో పోటీ పడితే లేనిపోని తలనొప్పులు తప్పవు. అందుకే ఈ రెండు సినిమాల వేడి తగ్గిన తర్వాత ఫిబ్రవరి 9న అయ్యారీ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రకుల్ ఆశలకు అలా గండికొట్టింది దీపిక పదుకొనే.