రంగ‌స్థ‌లం సంక్రాంతికి వ‌చ్చుంటే..!


ఇప్పుడు అంతా ఇదే అనుకుంటున్నారు. గ‌త కొన్ని సంక్రాంతుల‌తో పోలిస్తే ఈ సారి నీరుగారిపోయింది పండ‌గ‌. ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కాలేక‌పోయింది. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు చాప చుట్టేసింది. ప‌ర్వాలేదు అనే టాక్ తెచ్చుకున్న జై సింహా కూడా అజ్ఞాత‌వాసితో పోల్చిన‌పుడే బాగుందంటున్నారు కానీ నిజంగా అది కూడా రొటీన్ సినిమానే. ఇలాంటి టైమ్ లో ఒక్క సినిమాపై ఇప్పుడు చ‌ర్చ బాగా న‌డుస్తుంది. అదే రంగ‌స్థ‌లం. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఏం చేస్తాం.. ప‌వ‌న్ వ‌స్తున్నాడ‌ని తెలిసి త‌న సినిమాను పోస్ట్ పోన్ చేసాడు రామ్ చ‌ర‌ణ్. నిర్మాత‌ల‌ను ఒప్పించి మ‌రి రంగ‌స్థ‌లం మార్చ్ కు తీసుకెళ్లాడు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది. నిజానికి ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. క‌చ్చితంగా ఇది రొటీన్ రెగ్యుల‌ర్ మాస్ సినిమా అయితే కాదు.. ఇందులో చ‌ర‌ణ్ చెవిటివాడిగా న‌టిస్తున్నాడు. ఇది క‌న‌క సంక్రాంతికి వ‌చ్చుంటే ప‌రిస్థితులు మ‌రోలా ఉండేవంటున్నారు ట్రేడ్ వ‌ర్గాలు. క‌చ్చితంగా సంక్రాంతి విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు చ‌ర‌ణ్ కే ఉండేవంటున్నారు. పైగా గ‌తంలో ఎవ‌డు.. నాయ‌క్ లాంటి సినిమాలు సంక్రాంతికి వ‌చ్చి ప‌ర్లేద‌నిపించాయి. మొత్తానికి బాబాయ్ కోసం చేసిన త్యాగం ఇప్పుడు వృథా అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here