హీరో విష్ణు మంచు నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' ఆడియో మరియు ట్రైలర్ విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది. చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు దస్పల్లా హోటల్ లో జరిగింది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, వి వి వినాయక్ ల చేతుల మీదుగా పాటల సీడీని  విడుదల చేయడమైనది. చిత్ర ట్రైలర్ కూడా విడుదల కాగా ఇంటర్నెట్ లో విశేష స్పందన వస్తుంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ హైలైట్ గా కామెడీ ప్రధానంగా సాగే ట్రైలర్ చూస్తే చిత్రం ఆహ్లాదభరిత ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియులనుండి మంచి స్పందన వస్తుంది.
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం జనవరి 26 న విడుదల కానుంది.
జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణుల కలయికలో ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది ఆశించవచ్చు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ నటించిన ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.
” విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్ చూస్తుంటే నేను ఇరవై ఏళ్ల క్రితం మోహన్ బాబు, బ్రహ్మానందం తో తీసిన అల్లరి మొగుడు గుర్తుకొస్తుంది. ఆ చిత్రం లాగే ఇది కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు.
“చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో పూర్తి వినోదం తో, చాలా రిచ్ గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిందని. చాలా వరకు అమెరికాలోనే నిర్మించడం జరిగింది. నిర్మాతలు ఎక్కడ కంప్రమైస్ కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాన్ని నిర్మించారు,” అన్నారు దర్శకుడు. ” ఈ చిత్రంలో  బ్రాహ్మణులను గొప్ప తనాన్ని చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ వారిని కించ పరిచే సన్నివేశాలు ఉండవు. రచయతలు చాలా జాగర్తగా రాసారు.విష్ణు కి చిత్రం మరో ఢీ, దేనికైనా రెడీ తరహాలో గొప్ప విజయాన్ని అందిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు, ”   అని ధీమా వాయ్కతపరిచారు నిర్మాతలు.
హీరో విష్ణు మాట్లాడుతూ…”డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలంటే విన్నీని పెళ్ళి చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను పెళ్ళి చేసుకున్నది ఆయన్నే అనుకుంట అంత గొడవపడుతుంటాము మేము” అని చమత్కరించారు.
“నిర్మాత కీర్తి చౌదరి లాంటి స్ట్రాంగ్ వుమన్ ప్రొడక్షన్ లో యాక్ట్ చేసినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న. ఇటువంటి స్ట్రాంగ్ వుమన్ ప్రొడ్యూసర్ లు గా రాణించాలని కోరుకుంటున్నాను,” అన్నారు విష్ణు .
ఇక మలేషియా చిత్ర షూటింగ్ లో యాక్సిడెంట్ విషయం పై మాట్లాడుతూ…”మా అభిమానులకి, మా అమ్మ నాన్నకి, మా ఫ్యామిలీకి, వీనికి, ప్రజ్ఞకి సారి చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు మలేసియాలో ఆక్సిడెంట్ జరగడానికి కారణం I think I am the only reason. నేను స్టన్ట్ మ్యాన్ గా ట్రైన్ అయ్యాను, పని చేసాను. హీరో కాకముందు ఫైట్ మాస్టర్ అవుదామనుకున్నాను. అంత ఎక్స్పీరియన్స్ ఉండి, స్టన్ట్ మ్యాన్ తప్పు చేస్తున్నాడని తెలిసి నేను ఆ షాట్ చేసుండకూడదు. షూటింగ్ క్యాన్సిల్ చేస్తే నిర్మాతకు పదిలక్షలు లాస్ అవుతుందని ఆలోచించి చేసాను. నా తప్పు వల్ల ఇంతమందికి బాధ కలిగించినందుకు రియల్లీ సారీ,” అని వివరణ ఇచ్చారు విష్ణు.
ఇతర తారాగణం:
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి
సాంకేతిక వర్గం:
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్
ఎడిటింగ్: వర్మ
సంగీతం: ఎస్ ఎస్ థమన్, అచ్చు రాజమణి
మాటలు: డార్లింగ్  స్వామి
ఆర్ట్ : కిరణ్
యాక్షన్ : కనాల్ కన్నన్
బ్యానర్ : పద్మజ  పిక్చర్స్
సమర్పించు :  ఎం ఎల్ కుమార్  చౌదరి
నిర్మాతలు: కీర్తి  చౌదరి , కిట్టు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here