దీపిక పదుకొనే బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 200 కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది ఈ చిత్రం. తొలిరోజు నుంచే కలెక్షన్ల వేట మొదలుపెట్టింది పద్మావత్. ప్రీమియర్స్ తో కలిపి తొలిరోజే 25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాత రోజుల్లో మరింతగా రెచ్చిపోయింది. రెండోరోజు 32 కోట్లు.. మూడోరోజు మరో 25 కోట్లు ఇలా సాగుతుంది పద్మావత్ కలెక్షన్ల ప్రభంజనం. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మైలురాయి అందుకుని 200 కోట్ల వైపుగా వెళ్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రాణి పద్మావత్ హవా భారీగా ఉంది. ఈ చిత్రం ఇప్పటికే అక్కడ 34 కోట్లు వసూలు చేసింది. ఇక మిగిలిన దేశాల్లోనూ దుమ్ము దులిపేస్తుంది పద్మావతి. ఈ దూకుడు ఇలాగే సాగేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర ఒక్క సినిమా కూడా రావట్లేదు. ఫిబ్రవరి 9న అయ్యారీ.. ప్యాడ్ మ్యాన్ వచ్చే వరకు మరో సినిమా లేదు. దాంతో పద్మావత్ మరో పది రోజులు దుమ్ము దులిపేయడం ఖాయం. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రం దూకుడు ఇంకెన్ని రోజులు కొనసాగనుందో..?
పద్మావతి.. బాక్సాఫీస్ రాణి..!