ఈ ఇండస్ట్రీ తిరిగేదే హిట్ చుట్టూ. ఇక్కడ హిట్ కొడితే అంతా నీ చుట్టూ తిరుగుతుంటారు. రాత్రికి రాత్రే ఇక్కడ స్టార్ కావచ్చు.. జీరో కూడా కావచ్చు. ఇప్పుడు స్టార్ అయ్యే అవకాశం వెంకీ కుడుములకు వచ్చింది. ఎవరు ఈయన అనుకుంటున్నారా..? ఛలో సినిమా దర్శకుడు. త్రివిక్రమ్ శిష్యుడు.. అనే ముద్రతో ఇండస్ట్రీకి వచ్చిన వెంకీ తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించాడు. తెలుగు, తమిళ బార్డర్స్ లో ఉండే కథ తీసుకుని.. దానికే కావాల్సినంత కామెడీ యాడ్ చేసి చలోతో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఇప్పుడు ఛలో దూకుడు చూస్తుంటే ఈజీగా 12 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే సినిమా సేఫ్ జోన్ కు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఛలో దెబ్బకు ఏకంగా రవితేజ టచ్ చేసి చూడు కూడా సైలెంట్ అయిపోయింది. అంతగా కుమ్మేస్తుంది ఈ చిత్రం. అంచనాలు తక్కువగా ఉండటం ఛలోకు కలిసొచ్చింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఛలోకు ఎదురేలేకుండా పోతుంది. నాగశౌర్య కెరీర్ లోనే హైయ్యస్ట్ ఓపెనింగ్స్ తో ఛలో దూసుకెళ్లిపోతుంది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతుందిప్పుడు. మరి ఇదే దూకుడు ఫ్యూచర్ లోనూ కొనసాగిస్తాడో లేదో చూడాలిక..!