ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవర్నీ తక్కువగా అంచనా వేయకూడదు. వేసారో అడ్డంగా బుక్ అయిపోతారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రవితేజ లాంటి స్టార్ హీరో.. నాగశౌర్య లాంటి చిన్న హీరో చేతుల్లో ఓడిపోతున్నాడు. వీళ్లిద్దరూ నటించిన టచ్ చేసి చూడు, ఛలో ఒకేరోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది కొత్త దర్శకులే కావడం విశేషం. ఇందులో టచ్ చేసి చూడు పరమ రొటీన్ సినిమాగా ముద్ర పడి.. డిజాస్టర్ వైపుగా అడుగేస్తుంటే.. ఛలో మాత్రం రొటీన్ కథతోనే వచ్చినా సూపర్ ఎంటర్ టైన్మెంట్ తో కుమ్మేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకీ ఈ చిత్రం కలెక్షన్లు పెరుగుతుంటే.. టచ్ చేసి చూడు దారుణంగా పడిపోతున్నాయి. ఛలో సేఫ్ అవ్వాలంటే 6 కోట్లు వస్తే చాలు.. ఈ సినిమా దూకుడు చూస్తుంటే వీకెండ్ లోనే అది తెచ్చేలా కనిపిస్తుంది. ఇక టచ్ చేసి చూడు మాత్రం 28 కోట్లు తెస్తే కానీ హిట్ కాదు. ఇది దాదాపు అసాధ్యంగా కనిపిస్తుందిప్పుడు. మొత్తానికి గడ్డిపరక కూడా ఏనుగును బంధిస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు రవితేజ, నాగశౌర్యను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది