అంతా ఒకేరోజు రావాలనుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త డేట్లు చూసుకుంటున్నారు. ఫిబ్రవరి 9న సాయిపల్లవి కణం కూడా విడుదల కావాలి. కానీ ఆ రోజు మరో మూడు సినిమాలు ఉండటంతో లైకా ప్రొడక్షన్స్ వెనక్కి తగ్గారు. ఈ చిత్రం ఫిబ్రవరి 23కి వాయిదా పడింది. సాయిపల్లవితో పాటు ఈ చిత్రంలో నాగశౌర్య కూడా నటించాడు. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగా పెంచేసింది. కణం ట్రైలర్ చూస్తుంటే పెద్ద ఇష్యూను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతుంది. అబార్షన్.. ఆడపిల్లలను కడుపులోనే చంపేయడం.. ఈ కాంట్రవర్సియల్ కాన్సెప్ట్ తో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు నాగశౌర్య.
మా సారీ మా.. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్ అనే డైలాగ్ వింటుంటే కడుపులో ఉన్న పిండం అమ్మను వేడుకుంటున్నట్లు అనిపిస్తుంది. సాయిపల్లవి ఒరిజినల్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఎవరో హత్యకు గురి కావడం.. హంతకుడి కోసం పోలీసులు గాలించడం.. ఇంటిలో క్షుద్ర పూజలు చేయడం.. ఇవన్నీ కణం సినిమాపై అంచనాలు.. ఆసక్తి రెండూ పెంచేస్తున్నాయి.
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. కణంలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తమిళ్లో ఇదే పాత్రను ఆర్ జే బాలాజీ నటిస్తున్నాడు. ఓ పాప చుట్టూ ఈ కథ అల్లుకున్నాడు విజయ్. వరస విజయాలతో దూసుకుపోతున్న సాయిపల్లవి కణంకు ప్రాణంగా నిలిచింది. ఈమె నటిస్తుంది కాబట్టే తెలుగులోనూ కణంపై భారీ అంచనాలున్నాయి. కచ్చితంగా ఈ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టిస్తుందని నమ్ముతు న్నారు చిత్రయూనిట్. మరి చూడాలిక.. ఫిబ్రవరి 23న కణం ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో..?