నాని లవర్ క్లీవేజ్ షో చేస్తుందా.. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా తొలి సినిమా మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఆ హీరో కూడా అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా నాని హీరోయిన్ గురించే.. మెహ్రీన్ కౌర్. ఈ పేరు ఆ మధ్య తెలుగులో బాగా వినిపించింది. రెండు నెలల్లోనే ఐదు సినిమాలతో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. కృష్ణగాడి వీర ప్రేమగాథలో మహాలక్ష్మిగా ఎంతో పద్దతిగా ఒళ్లంతా కప్పుకుని అచ్చ తెలుగమ్మాయిలా కనిపించింది ఈ భామ. కానీ పైకి కనిపించేంత అమాయకురాలేం కాదు ఈ భామ. అవకాశం రావాలే కానీ గ్లామర్ షోతో మతులు పోగొట్టడానికి కూడా తాను సిద్ధమని హింట్ ఇచ్చింది మహ్రీన్. ఇప్పటికే జవాన్ లాంటి సినిమాల్లో దాన్ని ఆచరణలో పెట్టింది కూడా. కానీ ఏం చేస్తాం.. అదృష్టమే కలిసిరాలేదు.
ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త వెనకడుగు వేసిన మెహ్రీన్.. ఇప్పుడు ఫోటోషూట్స్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి పంథం సినిమాలో నటిస్తుంది. చక్రి దీనికి దర్శకుడు. ఇందులో గ్లామర్ పాత్రలోనే నటిస్తుంది మెహ్రీన్. ఇక ఇప్పుడు కొత్త ఫోటోషూట్ లో ఏకంగా క్లీవేజ్ షో చేస్తూ మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. తనకు అందాల ప్రదర్శన చేయడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ భామ. అంటే ఇప్పట్నుంచే ఇతర దర్శకనిర్మాతలకు తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమంటూ ఈ ఫోటోషూట్ తో సిగ్నల్ ఇచ్చేస్తుంది మెహ్రీన్. మొత్తానికి గాడి తప్పిన కెరీర్ ను మళ్లీ దారిన పెట్టుకోడానికి అందాల ఆరబోతే సరైన మార్గమని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ.