చిరంజీవి రాజకీయాలకు దూరంగా జరిగి రెండేళ్లవుతుంది. ఖైదీ నెం. 150 సినిమాకు కమిట్ అయిన తర్వాత పూర్తిగా హీరో అయిపోయాడు మెగాస్టార్. అటువైపుగా వెళ్లడం కూడా మానేసాడు. ఎం చక్కా తన సినిమాలు.. తాను అంటూ మళ్లీ ఇండస్ట్రీతో మింగిల్ అయిపోయాడు మెగాస్టార్. కానీ ఇప్పుడు మళ్లీ చిరు రాజకీయాల వైపు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం. అవును.. త్వరలోనే ఈయన ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నాడు. కర్ణాటకలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చిరంజీవి తీసుకుంటున్నాడిప్పుడు. ఎప్రిల్ లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి.
రాజకీయాల్లోకి వెళ్లినా కూడా సైరా షూటింగ్ కు మాత్రం వచ్చే ఇబ్బందేం లేదంటున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. ఫిబ్రవరి 23 నుంచి రెండో షెడ్యూల్ జరగనుంది. అది కూడా హైదరాబాద్ లోనే. కేరళలో అనుకున్న షెడ్యూల్ కు ఏదో చిన్న మార్పులు చేయాల్సి వచ్చింది. దాంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. తొలి షెడ్యూల్లో చిరు తప్ప ఎవరూ రాలేదు. రెండో షెడ్యూల్ నుంచి స్టార్స్ సందడి కనిపించనుంది. ఈ షెడ్యూల్లోనే జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి సెట్ లో అడుగు పెట్టనున్నారు. విజయ్ సేతుపతి ఇందులో ఉయ్యాలవాడుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఓబయ్య పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఫిబ్రవరి తర్వాత అమితాబ్ బచ్చన్ రానున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అమితాబ్ బచ్చన్. మనం తర్వాత ఆయన నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ చిత్ర విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మెగా వారసుడు. సురేందర్ రెడ్డి కూడా అన్నీ ఫిక్సైన తర్వాత కానీ రంగంలోకి దిగలేదు. 2019 సమ్మర్ కు సైరా విడుదల కానుంది. 200 కోట్లు ఈ చిత్రానికి ప్రాథమిక బడ్జెట్ గా నిర్ణయించారు. అది పెరిగినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. మొత్తానికి మరి చూడాలిక.. రాజకీయాలను, సినిమాలను చిరు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాడా..?