ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ ఇమేజ్ వస్తే చాలు.. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆ ఇమేజే వాళ్లకు శ్రీరామరక్ష. కావాలంటే చూడండి.. వరసగా రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చిన హీరో సినిమాకు బిజినెస్ ఎలా జరుగుతుంది..? ఎంత అడిగితే అంత ఇచ్చే రేట్ ఉంటుందా.. ఉండదు కానీ భరత్ అనే నేను దీనికి భిన్నం. ఇక్కడ మహేశ్ అనే స్టార్ ఉన్నాడు. ఆయన ఇమేజ్ ఉంది.. దాంతో సినిమాను ఫ్లాపులతో పనిలేకుండా భారీ రేట్ కు కొనేస్తున్నారు. ఆంధ్రా లోని కొన్ని ఏరియాల్లో ఈ చిత్ర రైట్స్ విని దిమ్మతిరిగిపోతుంది అందరికీ. ఎస్ క్రియేషన్స్ సంస్థ మూడు జిల్లాలకు కలిపి 22.5 కోట్లకు కొన్నారు. ఇదే ఇప్పుడు సంచలనం. కృష్ణా.. గుంటూర్.. వైజాగ్ ఏరియాల్లో భరత్ అనేనేను రైట్స్ 22 కోట్లకు పైగా వెళ్లాయి. ఇది రికార్డ్. కొరటాల శివ ట్రాక్ రికార్డ్ తో పాటు మహేశ్ ఇమేజ్ నే నమ్ముకుని ఇంత పెట్టేసింది ఎస్ క్రియేషన్స్.
ఈ చిత్రం ఎప్రిల్ 20న విడుదల కానుంది. ఆ తర్వాత వారమే రజినీ కాలా విడుదల కానుంది. ఏం చేసినా ఒక్క వారంలోనే మాయ చేయాలి మహేశ్. లేదంటే తర్వాత వారం సూపర్ స్టార్ వచ్చేస్తాడు. అదృష్టం బాగుండి ఆ సినిమాకు కానీ పాజిటివ్ టాక్ వస్తే మహేశ్ కు తిప్పలు తప్పవు. కాలా బారి నుంచి బయట పడాలంటే భరత్ అనేనేను బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకో వాల్సిందే.. మరో ఆప్షన్ కూడా లేదు. ఓవరాల్ బిజినెస్ లోనూ భరత్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 18 కోట్లకు పైగానే అమ్మడైపోయినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఓ రికార్డే. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ 70 కోట్ల వరకు భరత్ అనేనేను బిజినెస్ జరుగుతుంది. కొననైతే కొంటున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుందో అనే టెన్షన్ తో చచ్చిపోతున్నారు బయ్యర్లు. చూడాలిక.. మహేశ్ ఈ సారి బయ్యర్లను ఏం చేస్తాడో..?