ఏ 100 కోట్లు అనుకుంటున్నారా..? అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్రీదేవి దగ్గర 100 కోట్లు ఎక్కడున్నాయి. ఆమె చనిపోయే ముందు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే వార్తలొచ్చాయి కదా అనుకుంటున్నారా..? అవును.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో ఎవరూ ఇన్సూరెన్స్ చేయించుకోకుండా ఉండలేరు. అలాంటి శ్రీదేవి లాంటి సెలెబ్రెటీ మాత్రం అలా చేయించుకోకుండా ఉంటుందా..? పైగా తన కుటుంబం పరిస్థితి పూర్తిగా తెలిసిన శ్రీదేవి.. ఆ మాత్రం జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి..? అందుకే ఆమె ఉన్నపుడే ఏకంగా 100 కోట్ల ఇన్సూరెన్స్ చేయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు శ్రీదేవిది మిస్టరీ డెత్ అనే అనుమానాలు రావడానికి ఈ ఇన్సూరెన్స్ కూడా కీలకమైంది. కానీ ఆ తర్వాత ఆమెది అనుకోకుండా జరిగిన మరణమే అని తేలింది.
అసలు మనిషి ఉన్నపుడు వాళ్ల విలువ తెలియదు. పోయిన తర్వాతే వాళ్ల గురించి తలుచుకుని ఏడుస్తుంటారు. శ్రీదేవి కుటుంబ పరిస్థితి కూడా ఇంతే. పేరుకు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా కోట్లు మాత్రం లేవనే తెలుస్తుంది. శ్రీదేవి చివరి రోజుల్లో బాగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. బోనీకపూర్ మొదటి భార్య బంధువులు ఆమెతో ఆస్తి తగాదాలకు కూడా దిగారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదంతా గతం. శ్రీదేవి ఇప్పుడు లేదు. పోయింది.. వెళ్లిపోయింది.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. మళ్లీ ఎప్పటికీ రాదు. ఇప్పటి వరకు శ్రీదేవి కుటుంబం అంతా ఆమెపైనే ఆధారపడి ఉంది. ఆమె పిఆర్ వల్లే ఇన్నాళ్లూ ఆ కుటుంబానికి బాలీవుడ్ లో అంత వ్యాల్యూ. ఆమెపై ఉన్న గౌరవమో.. లేదంటే క్రేజో.. అదీ కాదంటే అభిమానమో తెలియదు కానీ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా శ్రీదేవి కోసం పోటీ పడ్డాయి.
ఆమె కూతురు ఝాన్విని పరిచయం చేయడానికి కూడా మూడేళ్లు ఆగి.. పెద్ద నిర్మాణ సంస్థలు అడిగినా కూడా చివరికి చాలా ఆలోచించి కరణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా విడుదల కాకుండానే చనిపోయింది శ్రీదేవి. కానీ ఇప్పుడు శ్రీదేవే లేదు. ఈ సమయంలో శ్రీదేవి కూతుళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. హేమామాలిని కూతుళ్లనే ఇప్పుడు పట్టించుకునే వాళ్లు లేరు. మరి శ్రీదేవి లేదిప్పుడు.. ఆమె కూతుళ్లను పట్టించుకుంటారా..? ఇక ఆర్థికంగా కూడా ఇన్నాళ్లూ శ్రీదేవి పుణ్యమా అని బోనీ కపూర్ కూడా హాయిగానే ఉన్నాడు. చనిపోయే ముందు ఈమె కుటుంబం కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే వార్తలున్నాయి. మరి ఇప్పుడు శ్రీదేవి లేని సమయంలో వాళ్ల కుటుంబం ఎలా మారబోతుందో..? ఆ 100 కోట్లు ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో..?