అవునా.. ఇప్పుడు వీళ్లిద్దరి సినిమాలు ఏమున్నాయి..? రంగస్థలం వచ్చేది మార్చ్ 30న.. భరత్ అనేనేను వచ్చేది ఎప్రిల్ 20న.. మధ్యలో 20 రోజులు గ్యాప్ ఉంది కదా..! ఇంక పోటీ ఎక్కడుంది అనుకుంటున్నారా..? అవును నిజమే.. కానీ వీళ్ల పోటీ తెలుగులో కాదు.. తమిళ్ లో. భాష కాని భాషలో పాత సినిమాలతో పోటీ పడుతున్నారు రామ్ చరణ్, మహేశ్ బాబు. ఇంతకీ విషయం ఏంటంటే.. తమిళనాట ఇప్పుడు మన సినిమాలకు డిమాండ్ పెరిగింది. మన హీరోల సినిమాలు కూడా అక్కడి ప్రేక్షకులు చూస్తున్నారు. ఇదివరకు అయితే కనీసం పట్టించుకునేవాళ్లు కాదు కానీ బాహుబలి పుణ్యమా అని మన పాత సినిమాలకు కూడా క్రేజ్ వచ్చేసింది. అందుకే వరసగా పాత సినిమాలను డబ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. అప్పుడెప్పుడో 2002లో మహేశ్ నటించిన టక్కరిదొంగ సినిమాను వెట్రివీరన్ పేరుతో ఇప్పుడు విడుదల చేస్తున్నారు. జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బిపాషా బసు, లిసారే హీరోయిన్లు. ఈ సినిమా ఇక్కడే ఫ్లాప్ అయింది. ఇప్పుడు తమిళ్ లో మార్చ్ 10న విడుదల చేస్తున్నారు. ఇక నాయక్ సినిమాను రౌడీనాయక్ పేరుతో విడుదల చేస్తున్నారు. చరణ్ సినిమానే నయం.. 5 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్తుంది. కానీ మహేశ్ మాత్రం ఏకంగా 16 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్తున్నాడు. మరి చూడాలిక.. ఈ రెండు సినిమాల భవిష్యత్తు తమిళనాట ఎలా ఉండబోతుందో..?