అవునా.. నయనతార సినిమాలు మానేస్తుందా..? ఎప్పట్నుంచీ.. ఎందుకు.. ఇలా అభిమానుల మదిలో ఎన్నో అనుమానాలు రావడం సహజం. కానీ ఇప్పటికిప్పుడు నయనతార మనసులో ఇది లేకపోయినా.. కచ్చితంగా మరో రెండు మూడేళ్లలో నయనతార ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అదేంటి అంటూ షాక్ అవ్వొద్దు. అదంతే.. ఇప్పుడు నయన మనసులో సినిమాల కంటే తన ఫ్యూచర్ పై ఎక్కువగా ఫోకస్ ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా అవకాశాలు తగ్గిపోతాయి.. ఇమేజ్ పోతుంది.. అప్పుడు ఏం చేయాలి..? అందుకే ఇప్పట్నుంచే అప్పటి గురించి ఆలోచిస్తుంది నయనతార. ఈ మధ్య మాటిమాటికి అమెరికా వెళ్తొస్తుంది ఈ ముద్దుగుమ్మ.
అది కూడా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి. అది జాలీ ట్రిప్ అని అంతా అనుకున్నారు.. సినిమాలతో అలిసిపోతుంది కదా సేద తీరడానికి వెళ్తుందేమో అనుకున్నారంతా. కానీ ఆ ట్రిప్ వెనక జాలీతో పాటు బిజినెస్ ప్లాన్స్ కూడా ఉన్నాయని ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న విషయం. అవును.. అమెరికాలో రెస్టారెంట్ బిజినెస్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది నయనతార. అక్కడే ఓ మంచి హోటల్ పెట్టాలని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ. అందుకే రెమ్యునరేషన్ దగ్గర ఏ మాత్రం తగ్గడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ సంపాదించిన మొత్తం అక్కడ రెస్టారెంట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలని ఫిక్సైపోయింది ఈ భామ. మొత్తానికి ప్రియుడితో కలిసి మంచి ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకుంది ఈ కేరళకుట్టి.