దేవీ శ్రీ ప్రసాద్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈయన ఏ మాయ చేస్తున్నాడో తెలియదు కానీ ఒక్కసారి ఈయన మ్యూజిక్ వినబడితే చాలు ఆరు నుంచి అరవై వరకు రచ్చ రంబోలే. ఇప్పుడు కూడా రంగస్థలం ఆడియో విడుదలైంది. మార్చ్ 18న ఉగాది సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ వేడుక జరగ బోతుంది. ఈ వేడుకకు వేదిక కోసం ఇంకా పోలీసుల పర్మిషన్ రాలేదు. కానీ ఇంకా రెండు రోజులు టైమ్ ఉంది కదా అందుకే కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చిరంజీవి కూడా రంగంలోకి దిగి తన ఆప్తమిత్రుడు ఘంటా శ్రీనివాసరావును రంగంలోకి దించి నట్లుగా తెలుస్తుంది అనుమతి కోసం. ప్రీ రిలీజ్ కంటే ముందే పాటలన్నీ విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన రంగస్థలం టైటిల్ సాంగ్.. ఎంత సక్కగున్నావే.. రంగమ్మ మంగమ్మ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు విడుదలైన మరో రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఆ గట్టునుంటావా అంటూ సాగే పక్కా ఫోక్ సాంగ్ ఒకటి.. జిల్ జిల్ జిగేలా రాణి అంటూ పూజాహెగ్డే చిందేసిన ఐటం సాంగ్ ఒకటి.. ఈ రెండు పాటలు కూడా అదిరిపోయాయి. వీటికి కూడా పక్కా మాస్ బీట్స్ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. ఇక సుకుమార్ ఈ పాటలను ఏ రేంజ్ తో చిత్రీకరించి ఉంటాడో లిరికల్ సాంగ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ట్రైలర్ మార్చ్ 18న ఉగాది కానుకగా విడుదల కానుందని తెలుస్తుంది. మార్చ్ 30న సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. అభిమానుల అంచనాలు.. దర్శక నిర్మాతల ఆశల్ని రంగస్థలం ఎంతవరకు నిలబెడుతుందో..?