ఒక్కోసారి మనం చేసే పనులు కలిసి రాకపోవచ్చు. కానీ ఆ పనులతో మనం ఇకపై చేయాలనుకుంటున్నాం అనే విషయంపై మాత్రం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అఖిల్ విషయంలో హలో ఇదే మేలు చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు. కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. కానీ హలో తర్వాత అఖిల్ కెరీర్ కు మాత్రం ఓ క్లారిటీ వచ్చింది. ఏం చేయాలో తెలుస్తుంది మనోడికి ఇప్పుడిప్పుడే. తన నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అర్థం చేసుకున్నాడు. యాక్షన్ ఫ్యాక్షన్ అంటే ప్రేక్షకులు నో చెప్పేసారు.. కానీ ప్రేమ అన్నపుడు ఓకే అన్నారు. విజయం నాని పట్టుకెళ్లిపోయినా గుర్తింపు అయితే ఇచ్చారు. అందుకే ఇప్పుడు హలో తర్వాత మరోసారి ప్రేమ కథనే నమ్ముకుంటున్నాడు అక్కినేని వారసుడు. అఖిల్ మూడో సినిమాపై ఇప్పటికి ఓ క్లారిటీ వచ్చింది. సత్యప్రభాస్ పినిశెట్టి.. సుకుమార్.. కొరటాల.. ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా.. చివరికి ఓ కుర్ర దర్శకుడితో తన సినిమాను కన్ఫర్మ్ చేసాడు అఖిల్. తొలిప్రేమతో సంచలన విజయం అందుకున్న వెంకీఅట్లూరితో అఖిల్ మూడో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను కూడా తొలిప్రేమ ఫేమ్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తానికి మరి చూడాలిక.. హలోతో సగమే అలరించిన అఖిల్.. ఈ సారి పూర్తిగా మాయ చేస్తాడో లేదో..?