నీది నాది ఒకే కథ మార్చ్ 23 న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో శ్రీ విష్ణు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
1 నీది నాది ఒకే కథ చిత్రాన్ని ఒప్పుకోవడానికి కారణం?
కథకు బాగా కనెక్ట్ అయ్యి చిత్రాన్ని ఒప్పుకున్నా. కథ కథనాలే ఈ చిత్రానికి హీరో…ఈ మధ్యకాలంలో స్టోరీ బోర్డు గీసుకొని మరీ తీసిన చిత్రం బహుశా ఇదే.
2 పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నటిస్తున్నారని విన్నాము?
బేసిక్ గా నేను వెంకటేష్ ఫ్యాన్ ను. ఇన్నేళ్లు స్టార్ గా ఉన్న ఏ కాంట్రవర్సీ లేకుండా ఉన్న ఏకైక హీరో అయన. వెంకటేష్ గారి సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతాది. చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చేస్తున్నాను ఎందుకంటే యూత్ లో ఎనభై శాతం మంది ఆయన ఫ్యాన్సే ఉంటారు కాబట్టి. ఎదో చేసేయకుండా…బయట పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే ట్రై చేశాను
3. నీది నాది ఒకే కథ నుండి ఏమి ఆశించ వచ్చు
పూర్వం మన టాటా ముత్తాతలు హ్యాపీ గా ఎనభై ఏళ్ళు బ్రతికేవారు , కానీ నేడు యాభై అరవై ఏళ్లకే రకరకాల జబ్బులొచ్చి చచ్చిపోతున్నాము. పోనీ ఉన్నన్నాళ్లు బాగా బ్రతికేమా అంటే… జీవితంలో ప్రతి స్టేజి లోని స్ట్రెస్, స్టూడెంట్ లైఫ్ కొంచెం సరికి కాంపిటీషన్ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలనే టెన్షన్. ఏమి ఎంజాయ్ చేయకుండానే యూత్ అయిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి మిగలదు. ఈ కథాంశం తీసుకొనే ఇంటరెస్టింగ్ గా 2 గంటలు ఎంటర్టైన్ చేసే చిత్రమవుతుంది. నేటి యువత బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు, ప్రతి ఒక్కలు తమకి రిలేట్ చేసుకుంటారు అందుకే నీది నాది ఒకే కథ అని టైటిల్ పెట్టాము.
4 దర్శకుని గురించి ఏమైనా చెప్పండి
వేణు అడుగుల కథను నతురాలిటీకి దగ్గరగా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించాడు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు.
5 తక్కువ బడ్జెట్లో కంటెంట్ ఉన్న చిత్రాలను చేస్తున్నారు. కథల ఎంపిక లో నారా రోహిత్ పాత్ర ఏమైనా ఉంటుందా?
కథను నేనే ఓకే చేస్తాను. నారా రోహిత్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా కథ విషయంలో నాకు స్వేత్చానిచ్చాడు. నా మీద పూర్తి నమ్మకంతో నాకే వదిలేస్తాడు. మా ఇద్దరి అభిరుచులు ఒకటే. మా టీం అంత ఓ ఫామిలీ లా సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనేదే నా తపన.
6 హీరోగా ఎదుగుతున్న సమయంలో ఉన్నది ఒకటే జిందగీ లో హీరో ఫ్రెండ్ గా చేయడం రాంగ్ ఛాయస్ కదా?
కిషోర్ తిరుమల నాకు మంచి స్నేహితుడు. అతనికోసమే ఆ చిత్రం చేశా. ఆ చిత్రం నాకు నటుడిగా మంచి పేరే తెచ్చి పెట్టింది. రామ్ లాంటి మంచి మిత్రుడు దొరికాడు.
7 బైయోపిక్స్ చేయాలనీ ఇంటరెస్ట్ ఉందా?
బైయోపిక్స్ కు నేను రెడీ. అయితే సచిన్ టెండూల్కర్ లా ఫేమస్ సెలెబ్రిటీల బయోపిక్ కాదు. ఎందుకంటే వారి గురించి అందరికి తెలిసిందే, కొత్తగా చూపించడానికి ఏమి ఉండదని నా నమ్మకం. మన ఊళ్లలో చాలా మంది గొప్ప పనులు చేసి ఎవరికీ తెలియకుండా ఉంటారు…అలాంటి వాళ్ళ బయోపిక్ చేయాలన్నది నా కోరిక.
8 మీ తదుపరి చిత్రాలు ఏమిటి?
నారా రోహిత్ తో పాటు వీరభోగ వసంత రాయలు లో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. నా గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. హాలీవుడ్ చిత్రంలా ఉంటుంది. తర్వాత తిప్పారు మీసం అనే మరో వైవిధ్యమైన చిత్రం కూడా చేస్తున్నాను. మెంటల్ మదిలో టీం తో కలిసి బ్రోచేవారెవరు రా అనే మరో చిత్ర కూడా చేస్తున్నాను.
– లక్ష్మి