ట్రెండ్ సెట్ చేయడం అంటే మాటలు కాదు. ఎప్పుడో కానీ జరిగే పని కాదు. ప్రతీ దర్శకుడి కెరీర్ లో ఒక్కసారి ఈ మ్యాజిక్ జరుగుతుంది. ఆర్యతో ఇప్పటికే ఆ మ్యాజిక్ చేసాడు సుకుమార్. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి సినిమా చేయడానికి సుకుమార్ తిప్పలు పడుతూనే ఉన్నాడు. 14 ఏళ్ల గ్యాప్ లో చాలా సినిమాలు చేసాడు సుకుమార్. కానీ ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ కాలేదు.. రాలేదు. ఆర్యతో వన్ సైడ్ లవ్ అంటూ కొత్త కాన్సెప్ట్ తో పిచ్చెక్కించాడు సుకుమార్. ఆ తర్వాత జగడం.. ఆర్య 2.. 100 పర్సెంట్ లవ్.. నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో.. ఇలా చాలా సినిమాలు చేసాడు ఈ దర్శకుడు. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. 100 పర్సెంట్ లవ్ హిట్టైంది.. నాన్నకు ప్రేమతో యావరేజ్ ఆడింది.. మిగిలిన సినిమాలు ఫ్లాపులు. ఇలాంటి టైమ్ లో రంగస్థలం అంటూ వస్తున్నాడు సుకుమార్. ఈ చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ సారి ఏదో సుకుమార్ ట్రెండ్ సెట్ చేసేలాగే ఉన్నాడు అనిపిస్తుంది. ఆ కళ కూడా ట్రైలర్ లో కనిపిస్తుంది. కంప్యూటర్ యుగంలోనూ కాంప్రమైజ్ కాకుండా 30 ఏళ్ల నాటి కథను ఎంచుకున్నాడు సుకుమార్. అక్కడే సగం విజయం సాధించాడు. ఇక ఇప్పుడు ఈయన తెరకెక్కించిన విధానం చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. కచ్చితంగా అవార్డులతో పాటు ప్రేక్షకులు ఇచ్చే రికార్డులు కూడా రంగస్థలంలో ఉండేలా కనిపిస్తున్నాయి. మరి చూడాలిక.. సుకుమార్ మరోసారి ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తాడో లేదో..?