ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్ & పీస్, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, సమాజ సేవకుడు డాక్టర్ వి.కె.నరేష్ ను కౌన్సిల్ జనరల్ (కల్చరల్ ఎఫైర్స్)గా నీయమించింది.
మార్చి 17న ఫిలిప్పినీస్ రాజధాని మనిలలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిలిప్పినీస్ దేశాధ్యక్షుడు రోడిగ్రో ఆర్.దుటురోస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకరణోత్సవానికి 1500 మంది ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రముఖులు, ప్రతినిధులు హాజరవ్వడం విశేషం.
ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియా ఛాన్సలర్ జనరల్ మరియు ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కేవలం నటుడిగానే కాకుండా సామాజిక ధృక్పధాన్ని గుర్తించి ఈ బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చాం. ఐక్యరాజ సమితిచే కౌన్సిల్ జనరల్ గా నియమించబడిన మొట్టమొదటి నటుడు డాక్టర్ వి.కె.నరేష్” అన్నారు.
ఇదే సందర్భంలో నరేష్ తన సెకండ్ డాక్టరేట్ (H.E – His Excellence) ను కూడా అందుకోవడం విశేషం. యూనియటెడ్ నేషన్స్ గ్రూప్ కి చెందిన U.N ICDRHRP ఈ డాక్టరేట్ ను నరేష్ కి అందించింది.