పెళ్లైతే ఇంటిపేరు మారుతుందేమో కానీ ఒంటితీరు ఎందుకు మారుతుంది..? ఎప్పుడూ ఒరిజినల్ అలాగే ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్లకు అయితే ఈ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఎక్కువ. అందుకే వాళ్లు పెళ్లైనా పెద్దగా మారరు. ఎలా ఉంటారో.. అలాగే ఉంటారు. పెళ్లైతే కొత్తగా మొగుడు వస్తాడు లైఫ్ లోకి అంతే తేడా వాళ్లకు. అందాల ఆరబోతలో వాళ్లు ఎవని మాటా అస్సలు వినరు. అక్కడ పెళ్లి.. పిల్లలు.. అనేవి అస్సలు లెక్కేకాదు. గ్లామర్ షో కు ఇవేవీ ముడి పెట్టొద్దనేది వాళ్ల వాదన. తాము అందాలు ఆరబోయాలనుకుంటే చాలు.. ఆరేస్తున్నారంతే. నిన్నగాక మొన్న కరీనా ఓ రేంజ్ లో రచ్చ చేస్తే.. ఇప్పుడు బిపాషా బసూ ఇదే దారిలో వెళ్తుంది. అసలు ఈ భామ దూకుడు చూస్తుంటే ముక్కునే కాదు.. అన్నిచోట్లా వేలు వేసుకోవాలేమో..? కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది బిపాషా. కానీ అందాల ఆరబోతకు మాత్రం దూరం కాలేదు. తాజాగా ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్ కు వెళ్లింది. అక్కడే మొగుడితో కలిసి బీచ్ లో బికినీతో రచ్చ చేసింది బిపాషా బసు. ఈ అందాలను చూసి అక్కడి సముద్రం కూడా వేడెక్కిపోయింది. ఇది చూసిన తర్వాత బిపాషా ఇంకా ఫామ్ లోనే ఉందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. రేపో మాపో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్నట్లు ఉంది ఈ పోజులు చూస్తుంటే. మరి బిప్స్ దూకుడు ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలిక..!