ఈ ఫోటో ఒక్కటి చాలేమో.. మెగా బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెప్పడానికి. చిరంజీవితో పవన్ దూరంగా ఉంటున్నాడంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. పైగా అన్నయ్యతో పవన్ కు రిలేషన్ కూడా మునపటిలా లేదని చెబుతుంటారు కొందరు. ఇక చరణ్ కూడా పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్నాడని.. బాబాయ్ అంటే ప్రేమ ఉన్నా కూడా దూరంగానే ఉంటున్నాడనే ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అవన్నీ అవాస్తవాలే అని.. ఎప్పుడూ అన్నయ్యే తన దేవుడు అంటాడు పవర్ స్టార్. ఇప్పటికీ అదే మాటపైనే ఉంటాడు. కాకపోతే రాజకీయాల్లో చిరు చేసిన కొన్ని పనులు మాత్రం పవన్ ను డిస్టర్బ్ చేసిన మాట వాస్తవం. అది కాకుండా పర్సనల్ గా మాత్రం చిరు అంటే పవన్ కు ఎనలేని గౌరవం. పవన్ అంటే చిరంజీవికి కూడా అంతే ప్రాణం. ఇక చరణ్ కూడా తనకు తండ్రి తర్వాత పవన్ అంటేనే ఎక్కువగా ఇష్టమని చెబుతుంటాడు. ఇప్పుడు వీళ్ల బంధం ఎలా ఉంటుందో చెప్పడానికి మరో నిదర్శనం వచ్చేసింది. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చిరు ఇంటికి వచ్చి అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు పవర్ స్టార్. అన్నయ్య చిరంజీవి.. వదిన సురేఖతో పాటు చరణ్ ను కలిసి ఓ ఫోటోకు పోజిచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మనుషులు దూరంగా ఉండొచ్చేమో గానీ మనసులు మాత్రం దూరం కావని మరోసారి ఈ ఫోటోతో నిరూపితమైంది. అబ్బాయి పుట్టినరోజుకు అన్నయ్య ఇంట్లో వాలిపోయాడు ఈ బాబాయ్. ప్రేమగా అబ్బాయికి తన ఆశీస్సులు అందించాడు. మరి చరణ్ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆశిద్ధాం.