రాజ‌మౌళి ఇంకా క‌థే చెప్ప‌లేదంట‌..!

Rajamouli Teasing NTR & Ram Charan Fans!
ఈ రోజుల్లో ఓ స్టార్ హీరోను ఒప్పించ‌డం అంటే ద‌ర్శ‌కుడికి ఎంత తిప్ప‌లు ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయ‌న క‌థ న‌చ్చితే కానీ బండి ముందుకు వెళ్ల‌దు. అలాంటిది ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను కూర్చోబెట్టి క‌థే చెప్ప‌కుండా ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు రాజ‌మౌళి. ఇది కేవ‌లం ఇండియాలో ద‌ర్శ‌క‌ధీరుడికి త‌ప్ప మ‌రే ద‌ర్శ‌కుడికి క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని విష‌యం. ఎందుకంటే ఈ రోజుల్లో 100 కోట్ల మార్కెట్ ఉన్న ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి ప‌నిచేయాలంటే ఎన్నో ఇమేజ్ స‌మస్య‌లు అడ్డు వ‌స్తాయి. కానీ ఇక్క‌డ ఉన్న‌ది రాజ‌మౌళి.. ఆ ఒక్క బ్రాండ్ తోనే సినిమా సాధ్య‌మైంది. క‌నీసం క‌థేంటి అని అడ‌క్కుండానే ఇటు ఎన్టీఆర్.. అటు రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చేసారు. ఏం చేస్తున్నారో చెప్ప‌కుండానే అన్నీ జ‌క్క‌న కోసం ధార‌పోస్తున్నారు. ఆయ‌న ఏం అడిగితే అది చేయ‌డానికి ముందుకొస్తున్నారు. ఓ లైన్ మాత్ర‌మే చెప్పి వాళ్ల‌ను సిద్ధం కండి అంటూ ఆదేశించాడు రాజ‌మౌళి. స్టార్ హీరోలు రాజ్య‌మేలుతున్న ఇండ‌స్ట్రీలో ఓ ద‌ర్శ‌కుడు ఇలా క‌థ కూడా చెప్ప‌కుండా ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను మ‌ల్టీస్టార‌ర్ కు ఒప్పించ‌డం మాత్రం నిజంగా సంచ‌ల‌న‌మే. ఇది కేవ‌లం జ‌క్క‌నకు మాత్ర‌మే సాధ్యం. మ‌రి వీళ్ల‌కు క‌థ ఎప్పుడు చెప్తాడో.. అది ఎలా ఉండ‌బోతుందో..? అక్టోబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. 2020లో సినిమా విడుద‌ల కానుంది. దాన‌య్య నిర్మాత‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here