ఒక్కసారి తెగించాలని ఫిక్స్ అయిన తర్వాత ముందు వెనక చూసుసకునేది ఏం ఉండదు. ఇప్పుడు శ్రీరెడ్డిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నెల రోజుల కింది వరకు అసలు ఈ భామ ఎవరో కూడా జనాలకు తెలియదు. కానీ ఇప్పుడు ఈమె తెలియని వాళ్లంటూ ఉండరు. అంతగా ఇండస్ట్రీ గుట్టు రట్టు చేస్తుంది శ్రీరెడ్డి. యాంకర్ గా మొదలై.. నటిగా మారి.. ఇప్పుడు అవకాశాల్లేక పిచ్చిపిచ్చిగా పచ్చిపచ్చిగా ఇండస్ట్రీ గురించి నోటికొట్టినట్లు మాట్లాడేస్తుంది శ్రీరెడ్డి. తాజాగా ఆమె శేఖర్ కమ్ములపై చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. తెలుగమ్మాయిలు పక్కలోకి తప్ప ఇంకెందుకు పనికిరారు అనుకుంటుంటాడు ఈ బక్కపీచు డైరెక్టర్ అంటూ మొన్న కమెంట్ చేసింది శ్రీరెడ్డి. దానికి శేఖర్ కమ్ముల రియాక్ట్ అయ్యాడు. నన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ నా దగ్గరికి వచ్చింది.
దానికి కచ్చితంగా నా మనసు బాధ పడింది.. అమ్మాయిల సాధికారికత కోసం ఎప్పుడూ పాటుపడే నన్ను ఇలాంటి వాటిలో ఇరికించడం ఏమీ బాగోలేదు.. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తాను కోర్ట్ నోటీసులు పంపిస్తా అంటూ శేఖర్ కమ్ముల ఓ స్టేట్మెంట్ విడుదల చేసాడు. దీనికి మళ్లీ ఇప్పుడు శ్రీరెడ్డి కూడా సెటైర్ వేసింది. ఏంటి శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట.. మా లాంటి చిన్న వాళ్ల మీద మీ జులుం ఏంటి సర్.. అయినా నేనేదో బెడ్ టైప్ కథలు రాస్తూ ఉంటా నా కోసం.. నా ఫ్యాన్స్ కోసం.. అయినా మీరేం చేయలేదుగా ఇంకెందుకు ఈ లొల్లి.. అంటూ ఫేస్ బుక్ లో రాసుకొచ్చింది. ఈ భామ ధైర్యం చూస్తుంటే ఇండస్ట్రీలో చాలా మంది జాతకాలు బయట పెట్టేలా కనిపిస్తుంది. మొత్తానికి తనకు అవకాశాలు ఇవ్వలేదని మొత్తం ఇండస్ట్రీనే ఇలా నిందించడం మాత్రం మంచిది కాదని శ్రీరెడ్డిపై చాలా మంది గుస్సాయిస్తున్నారు ఇప్పుడు. మరి చూడాలిక.. ఈ రచ్చ ఇంకెంత దూరం ఇలాగే సాగుతుందో..?