ఏమో ఇప్పుడు అభిమానులకు కూడా ఇదే అనుమానం వస్తుంది. మొన్నటికి మొన్న కళ్యాణ్ రామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ రాలేదు. గత కొన్నేళ్లలో కళ్యాణ్ రామ్ ఏ సినిమాకు కూడా ఎన్టీఆర్ రాకుండా ఉండలేదు. కానీ ఎమ్మెల్యే ఈవెంట్ కు మిస్ అయ్యాడు. ఆ రోజు ఎన్టీఆర్ రానందుకు కూడా ఎవరూ ఫీల్ అవ్వలేదు. కళ్యాణ్ రామ్ కూడా అసలు తమ్ముడు రాలేదనే ఫీల్ చూపించలేదు. ఎందుకంటే రాకపోవడానికి కారణం కూడా అంతే బలంగా ఉంది కాబట్టి. త్రివిక్రమ్ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు యంగ్ టైగర్. సన్నగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ చేసాడు. మొహంలో కూడా చాలా కళ వచ్చింది. ఇంత కష్టపడినందుకు అయినా ఎన్టీఆర్ లుక్ ను బయటికి మామూలుగా తీసుకు రాకూడదనే ఉద్ధేశ్యంతోనే ఎన్టీఆర్ ఎమ్మెల్యే ఈవెంట్ కు రాలేదు. అదే కారణం కూడా చెప్పాడు కళ్యాణ్ రామ్. అయితే ఈ చిత్రం ఓపెనింగ్ కు ఇంకా వారం రోజులు టైమ్ ఉంది. కానీ అప్పుడే లుక్ బయటికి వచ్చేసింది.
స్వయంగా ఎన్టీఆరే వచ్చేసాడు. అప్పుడు అన్నయ్య కోసం రాలేదు కానీ ఇప్పుడు ఐపిఎల్ కోసం మాత్రం వచ్చేసాడు. ఐపిఎల్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. తెలుగు వర్షన్ కు యంగ్ టైగర్ ను తీసుకుంది స్టార్ సంస్థ. దీనికోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. కమర్షియల్ పర్పస్ కాబట్టి దీనికోసం లుక్ బయటికి వచ్చినా పర్లేదని వచ్చేసాడు ఎన్టీఆర్. కానీ అన్నయ్య కోసం మాత్రం రాలేకపోయాడు జూనియర్. ఇదే ఇప్పుడు అభిమానుల్లో అనుమానం. లుక్ బయటికి రాకూడదు అనుకుంటే ఐపిఎల్ యాడ్ లో కూడా ఎన్టీఆర్ కనిపించేవాడు కాదు.. కానీ కమర్షియల్ కోణంలో ఆలోచించి బయటికి వచ్చేసాడు. ఎప్రిల్ 7 నుంచి ఐపిఎల్ మొదలు కానుంది. ఆ లోపే జూనియర్ నటించిన యాడ్ కూడా టీవీల్లో వచ్చేసింది. మొత్తానికి అఫీషియల్ గా ఎన్టీఆర్ లుక్ బయటికి విడుదల చేద్దాం అనుకున్న త్రివిక్రమ్ కు ముందుగానే అన్నీ శృంగభంగాలే జరిగాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ఐపిఎల్ యాడ్ ను తెరకెక్కించింది కూడా మాటల మాంత్రికుడే కావడం విశేషం.