పూరీ సినిమా అంటే మాఫియా.. గొడవలు.. ఇవే అతడి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఎందుకు పూరీ ఎప్పుడు అవే చేస్తుంటాడు.. ఆయనకు కొత్త ఆలోచనలే రావా అనుకుంటున్నారు ప్రేక్షకులు కూడా. వీటికి తన కొడుకు సినిమాతోనే సమాధానం చెప్పడానికి రెడీ అయ్యాడు ఈ దర్శకుడు. ఈ మధ్య కాలంలో మరీ రొటీన్ సినిమాలు చేస్తూ విమర్శల పాలవుతున్న పూరీ.. తనయుడి కోసం కొత్త కథ రాసుకున్నాడు. అది కూడా ఇండో పాక్ ప్రేమకథ. మెహబూబా అది దీనికి టైటిల్ కూడా పెట్టేసాడు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత కచ్చితంగా పూరీలో ఎంత మార్పు వచ్చిందో అర్థమైపోతుంది. పూర్తిగా ఇండో పాక్ కథను రాసుకుని.. దానికి దేశభక్తిని పెట్టేసి ప్రేమను చూపించాడు పూరీ జగన్నాథ్. నేహాశెట్టి అనే బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకొచ్చాడు పూరీ. కెరీర్ కొత్తలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. ఇడియట్.. శివమణి.. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాల్లో పూరీ ప్రేమకథలు అదిరిపోయాయి.
మళ్లీ ఇన్నాళ్లకు 1971 ఇండోపాక్ వార్ నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథను తీసుకొస్తున్నాడు పూరీ. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పంజాబ్, మధ్య ప్రదేశ్, లడక్ లాంటి ప్రదేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిపాడు పూరీ జగన్నాథ్. దీనికి నిర్మాత కూడా ఆయనే. దిల్ రాజు సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాకిస్థాన్.. హీరోది ఇండియా. ఇండియన్ అబ్బాయి.. పాక్ అమ్మాయి మధ్య ప్రేమకథ అనేదే పెద్ద కమర్షియల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఈ రెండింటి మధ్యలో పూరీ ప్రేమకథ ఎలా ఉండబోతుందో..? ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి మే 11న విడుదల సినిమాను విడుదల చేయబోతున్నాడు. మరి ఇతర వారసులకు మంచి లాంఛింగ్ ఇచ్చిన పూరీ.. మెహబూబాతో తన వారసుడికి ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలిక..!