వైఎస్ఆర్ బయోపిక్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి చర్చే నడుస్తుంది. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. మహి వి రాఘవ్ యాత్ర పేరుతో ఈ బయోపిక్ మొదలుపెట్టాడు. దీనిపై అంత ఆసక్తి ఉండటానికి కూడా కారణం వైఎస్ఆర్. ఎందుకంటే ఆయన మాస్ లీడర్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాస్ లీడర్. ఆయన పోయి పదేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ ఛరిష్మా మాత్రం అలాగే ఉంది. దాంతో ఇప్పుడు యాత్ర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంతో వైఎస్ఆర్ గా మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇంకా ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి. అయితే వీటిలో ఎవరు నటిస్తున్నారో మాత్రం క్లారిటీ లేదు. అన్నింటికంటే ముఖ్యంగా జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ముందు దీనికి సూర్య అనే సమాధానం వచ్చింది. కాదని దర్శకుడే చెప్పేసాడు. కానీ ఇందులో జగన్ గా నటించబోయేది సుధీర్ బాబు అని తెలుస్తుంది. అవును.. సుధీర్ బాబు అయితేనే జగన్ పాత్రకు సరిపోతాడని భావిస్తున్నారు. దాంతోపాటు చంద్రబాబునాయుడుగా ఓ ప్రముఖ హీరోను తీసుకుంటున్నారని తెలుస్తుంది. దానికితోడు ఈ చిత్రంలో పోసానీ కీలకపాత్రలో నటించబోతున్నాడు. యాత్ర ఇదే ఏడాది విడుదల కానుంది.