తెలుగులో చాలా రోజులైంది ఈ పేరు వినిపించక. నటించిన సినిమాల్లో చాలా వరకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినవే. పట్టుమని పది రోజులు ఆడిన సినిమాలు లేవు. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ఆచారి అమెరికా యాత్ర మాత్రం ఇప్పటికీ రావట్లేదు. దాంతో ఇప్పుడు అందాల ఆరబోతనే నమ్ముకుంటుంది ప్రగ్యా. అయినా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా మార్గాలుంటాయి. అందులో అందాల ఆరబోత ఒకటి. ఇప్పుడు ప్రగ్యాజైస్వల్ చేస్తుంది ఇదే.
ఇలాంటి హీరోయిన్లకు హిట్లు ఫ్లాపులతో పని ఉండదు. వాళ్లు సినిమాలో ఉంటే అందాలు మాత్రమే చూస్తుంటారు. వాళ్లు నమ్మేది కూడా ఇదే. ప్రగ్యాజైస్వల్ పూర్తిగా ఇదే చేస్తుందిప్పుడు. నటించే ప్రతీ సినిమాలోనూ అందాలనే ఆయుధంగా వాడేస్తుంది. నటన ఎలా ఉంది అనే విషయంతో ఈమెకు పనిలేదు. ఎందుకంటే కంచెలో అద్భుతమైన నటన కనబర్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత రూట్ మారిస్తే అవకాశాలిస్తున్నారు.
దాంతో ఇదే రూట్ కరెక్ట్ అనే భావనలో ఉంది ఈ ముద్దుగుమ్మ. కావాలంటే చూడండి.. మొన్న నక్షత్రంలో బికినీ సాంగ్ తో బీచ్ లో సాయిధరంతేజ్ తో రెచ్చిపోయిన ప్రగ్యా.. ఆ సెగలు తగ్గకముందే బోయపాటి శీను జయ జానకి నాయకాలో చిల్ బాస్ అంటూ చిట్టిపొట్టి డ్రస్సుల్లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది ప్రగ్యాజైస్వల్. పైగా కెమెరాలన్నింటినీ ముద్దుగుమ్మల అందాలపైనే ఫోకస్ చేసాడు బోయపాటి. ఇక ఇప్పుడు ఫోటోషూట్ లో రెచ్చిపోయింది.
ఈమె అందాల ఆరబోత చూసి షాక్ అయిపోతున్నారు ప్రేక్షకులు. అసలే బాలీవుడ్ నుంచి వచ్చిన భామ కదా.. ఇక్కడ అసలు అడ్డూ అదుపులేమీ లేవు. మొన్నే నక్షత్రంలో బికినీ వేసింది. ఇప్పుడు మరోసారి బికినీలో సెగలు పుట్టించింది. బ్లాక్ డ్రస్ లో ఆమెను చూస్తుంటే అమ్మో చెమటలు పట్టాల్సిందే..! మొత్తానికి హిట్లు లేకపోయినా కేవలం ఈమె అందాల ఆరబోత కోసమైనా పిలిచి మరి ఆఫర్లు ఇచ్చేలా ఉన్నారు దర్శక నిర్మాతలు.