చివరి వరకు ఓటమి ఒప్పుకోకు.. గెలుపు కోసం ప్రయత్నించు.. ఇండస్ట్రీలో ఉండాలంటే ఇదే అర్థం చేసుకోవాలి. కృతికర్బందాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. కొందరు ముద్దుగుమ్మలకు సినిమాలతో పనిలేదు. కేవలం అందాలతోనే చంపేస్తుంటారు వాళ్లు. అలాంటి వాళ్లలో కృతికర్భందా ముందుంటుంది. ఈ భామకు సరైన సినిమాలు పడట్లేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం నెట్టుకొస్తూనే ఉంది. దక్షిణాది ఇండస్ట్రీ దండం పెట్టి పంపినా.. బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది ఈ భామ. ఎనిమిదేళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన కృతికర్భందా..
ఇప్పటికీ ఉనికి కోసం పోరాడుతూనే ఉంది. చివరికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా ఈ భామ జాతకం మార్చలేదు. దాంతో ఇప్పుడు కృతి ముందున్న ఏకైక లక్ష్యం అందాల ఆరబోత. గ్లామర్ షో లో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు కృతికర్బందా. ఇప్పటికీ హీరోయిన్ గా వెలిగిపోదామనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికీ హాట్ ఫోటోషూట్లతో రప్ఫాడిస్తుంది కృతి.
ఓ వైపు అక్క పాత్రలు చేస్తూనే మరో వైపు హీరోయిన్ రోల్స్ కోసం కూడా ప్రయత్నాలు ఆపడం లేదు కృతి కర్బందా. ఆ మధ్య ఓ హాట్ ఫోటోషూట్ తో తానింకా హీరోయిన్ మెటీరియల్ నే అంటూ దర్శకనిర్మాతలకు ఓ హింట్ వదిలేసింది కృతి. ఆ తర్వాతే బాలీవుడ్ లో రాజ్ 4 సినిమాలో ఇమ్రాన్ హష్మీ, గౌరవ్ అరోరాలతో రొమాన్స్ చేసింది. ఈ సినిమాలో అయితే ఏకంగా హాట్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. అయినా అదృష్టం మాత్రం కలిసి రాలేదు.
రాజ్ 4 ఫ్లాప్ తో కృతి జాతకం మారలేదు. అయినా పట్టువదలని విక్రమార్కిణిలా మారిపోయింది కృతికర్భందా. ఈ మధ్యే రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన షాదీ మే జరూర్ ఆనా సినిమాలోనూ ముద్దులతో ముంచెత్తింది. ఇక ఇప్పుడు వీరి కి వెడ్డింగ్ లోనూ గ్లామర్ షోతో చంపేసింది కృతి. ఏ ఈవెంట్ కు వచ్చినా ఉల్లిపొర కంటే పలుచగా ఉండే దుస్తుల్లో కనిపిస్తుంది. మొత్తానికి అస్త్రాలన్నీ బాగానే వాడుతుంది ఈ బ్యూటీ. మరి అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో చూడాలి..!