మూడేళ్లు.. ఎనిమిది విజయాలు.. ఎవరికీ అందనంత ఎత్తులో ఫామ్.. ఇవన్నీ చూసి నానిని ఇప్పట్లో ఎవరూ అందుకోలేరు అని అంతా ఫిక్స్ అయ్యారు. అసలు నాని సినిమా వచ్చిందంటే ఎలా ఉంది అని అడగడం మానేసి.. ఎంత తెస్తుంది అని అడుగుతున్నారు. ఇలాంటి టైమ్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం ఎందుకో కానీ నాని స్పీడ్ కు బ్రేకులు వేసేలా కనిపిస్తుంది. ఈ చిత్ర కలెక్షన్లు ఊహించినంతగా రావట్లేదు.
ఓపెనింగ్స్ లో ఎంసిఏ నాని కెరీర్ లోనే కొత్త రికార్డులు తిరగరాస్తే.. కృష్ణార్జున యుద్ధం మాత్రం చాలా తక్కువ వసూళ్లు తీసుకొచ్చింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఎంసిఏ 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది.. ఇప్పుడు దానికంటే ఎక్కువ థియేటర్స్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం.. 4 కోట్ల తక్కువ ఓపెనింగ్ తీసుకొచ్చింది. పైగా ఓవర్సీస్ లో అయితే ఎందుకో తెలియదు కానీ ప్రీమియర్సే తక్కువగా వచ్చాయి.
ఎంసిఏ 3 లక్షల డాలర్లు తీసుకొస్తే.. ఈ చిత్రం కేవలం లక్షా 50 వేల డాలర్ల దగ్గరే ఆగిపోయింది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే కృష్ణార్జున యుద్ధం నాని జోరుకు బ్రేకులు వేసేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్షరాలా 30 కోట్లు రావాలి. మరి చూడాలిక.. చివరి వరకు ఏం జరుగుతుందో..?