శ్రీరెడ్డి.. నీకైనా ఉందా క్లారిటీ..?


ఇది నిజంగా కాస్టింగ్ కౌచ్ మీద జరుగుతున్న పోరాటమా లేక పవన్ కళ్యాణ్ ని అణిచివేయడానికి చేస్తున్న ప్రయత్నమా. ఏంటి కాస్టింగ్ కౌచ్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా! శ్రీ రెడ్డి ఒక ఉద్యమం.చేస్తున్న పోరాటం లో పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయమని అడిగింది. పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు నచ్చలేదో లేక  తనకు కావాల్సినటుగా స్పందించలేదు అనుకుందో ఏమో, పవన్ కళ్యాణ్ ని కుడా దూషించడం మొదలెటింది  శ్రీ రెడ్డి.
అసలు శ్రీ రెడ్డి కావాల్సింది ఏంటి పబ్లిసిటీ నా లేక ఏదో ఒక దారిలో డబ్బులు సంపాదించడమా? శ్రీ రెడ్డి చేస్తున్న స్టంట్లు చూస్తుంటే పబ్లిసిటీ తో డబ్బులు వెనకేసుకుంటుంది అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి అని పెద్దలన్న మాట బాగా వంటబట్టించుకున్న శ్రీ రెడ్డి డబ్బులు ఇస్తే వాళ్లకి అనుగుణంగా మాట్లాడుతున్నట్లు ఉంది. అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయించడం మంచిదని పవన్ కళ్యాణ్ అన్నందుకు.. స్పెషల్ స్టేటస్ కోసం మీరు ఎందుకు  రోడ్లు ఎక్కుతున్నారు అని వ్యక్తిగత సమస్యని రాష్ట్ర సమస్యతో ముడి పెట్టింది శ్రీ రెడ్డి. ఈ అమ్మాయి లాజిక్ ఎలా ఉంది అంటే ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేయకుండా కోర్ట్ లో వేస్తే స్వతంత్రం వచ్చేది కదా అన్నట్టు ఉంది అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
కోన వెంకట్ తో పాటు ఎందరో తనని వాడుకున్నారు తప్ప అవకాశాలు ఇవ్వలేదు అని ఇండస్ట్రీలో ఇలా ఆడవాలని వాడుకొని వదిలేస్తున్నారు,  వాళ్లపై చర్యలు తీసుకోవాలి అని రోడ్ మీదకి వచ్చాను అని అంటుంది శ్రీ రెడ్డి. తనకి నిజంగా అన్యాయం జరిగితే వాటికి సాక్ష్యాలు ఉంటె గంటలు గంటలు డిబేట్లు పెట్టకుండా  .. పోలీస్ స్టేషన్లో కేస్ ఫైల్ చేస్తే సరిపోతుంది కదా.. ఈ రచ్చ అంతే ఎందుకు..? ఆడవాళ్ల కోసం నిలబడతాను అని గట్టిగ వాదిస్తున్న ‘శ్రీ శక్తి ‘ ,  పవన్ కళ్యాణ్ తల్లిని అంత నీచంగా దూషించడం ఎంత వరకు సబబు అని అభిమానులే కాదు కామన్ సెన్స్ ఉన్నవారు అందరు అడుగుతున్నారు. పిల్లలు, కుటుంబం తో చూసే టీవీ ఛానెల్లో తన నోటికొచ్చినట్లు అసభ్య పదజాలం తో విచక్షణ లేకుండా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిన శ్రీ రెడ్డి ని వెనకేసుకు వస్తూ కొన్ని  మీడియా చానెల్స్ కొమ్ము కాస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్. ఇది జర్నలిజమా అని ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.
సంధ్య గారు మాట్లాడుతూ వెంకటేష్ తప్ప హీరో లంతా వెబిచారులే అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంత తెలిసినా మరి ఇంకా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి న్యాయం పోరాటం చెయ్యట్లేదు అని ప్రశ్నించే వారు లేరు , సామజిక న్యాయం కోసం పని చేస్తాం అని అన్నవారు ఒక అమ్మాయి కి అన్యాయం జరిగిన నాడే బయటికి రావాల్సిన సంఘాలు మంచి పనికి పోరాడాలి.. కానీ ఇలా పొలిటికల్ పార్టీలతో చేతులు కలిపి అర్ధం పర్థం లేని స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఇది ఏ పొలిటికల్ పార్టీ వాలు చేస్తున్నారో అందరికి తెలుసు. ఇకనైనా కుళ్ళు రాజకీయాలు చేసే వారితో చేతులు కలిపి ఇంకా నీచపు రాజకీయాలు చేయకుండా. ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడండి. ప్రజలు అన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు, బురద చల్లాలి అనుకుంటే ముందు మీ చేతులకే అంటుకుంది అని మర్చిపోకూడదు.. అని ప్రజలు బహిరంగ చేర్చలే చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here