మరో రెండు రోజుల్లో భరత్ అనే నేను విడుదల కానుంది. ఎప్రిల్ 20న దాదాపు 2 వేల థియేటర్స్ లో వస్తుంది ఈ చిత్రం. ఓవర్సీస్ లో అయితే రోజు ముందే 2 వేల ప్రీమియర్స్ వేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ప్రీమియర్ షోలు భారీగానే ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. కానీ ఇది ఇప్పుడు వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదు.
తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు అనుమతి రాలేదు. భరత్ అనే నేనును ముందు రోజు రాత్రే చూడాలనుకున్న అభిమానుల కలలు నెరవేరడం లేదు. ఈ ఒక్క సినిమా అనే కాదు.. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా పెద్దగా పర్మిషన్స్ రాలేదు. బాహుబలి 2 తర్వాత అర్జున్ రెడ్డి మాత్రమే ప్రీమియర్స్ వేసుకున్నారు.
ఆ తర్వాత అజ్ఞాతవాసికి సైతం ప్రీమియర్స్ కోసం పర్మిషన్ రాలేదు. ఇక ఇతర సినిమా లకు సైతం ఎవరూ అడగలేదు. మొన్న రంగస్థలం కోసం చివరివరకు ప్రయత్నించినా అనుమతి రాలేదు. దాంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు మహేశ్ అభిమానులది కూడా ఇదే పరిస్థితి. మొత్తానికి భరత్ అనే నేను ఎప్రిల్ 20నే విడుదల కానుందన్నమాట.