యుద్ధం చేయడానికి ఆయుధం ఉంటె సరిపోదు వ్యూహం ఉండాలి అని మహాభారతం లో చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ బాగా వంట పాటించుకున్నాడు. ఏళ్లగా తనని అనవసరంగా ప్రతి అనవసరమైన దాంట్లో ఇరికిస్తున్నారు అని సాక్ష్యాలతో సహా ఒక్కసారిగా అందరి పేర్లు బహాటంగా చెప్పి అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పుకునే మీడియా సంస్థలు కొన్ని రాజకీయ నాయకుల చేతులో పావులుగా మారీ పవన్ ఇమేజీని డామేజ్ చేయడమే కాకుండా తన తల్లిని ఏ కొడుకు వినకూడని మాటలు అనిపించి పదే పదే అదే టెలికాస్ట్ చేసి మీ నీచపు టిఆర్పిల కోసం అమ్ముడు బోయారు అని సామజిక మాధ్యమం ద్వారా చెప్పారు, పవన్ కళ్యాణ్.
యుద్ధం గెలవడం అంటే శత్రువిని చంపడం కాదు ఓడించడం అని చూపిన పవన్ కళ్యాణ్ లోని సినిమా డైలాగ్ ఇక్కడ బాగా వర్కౌట్ అయింది. చంద్రబాబు పుట్టిన రోజునాడు తన నిజస్వరూపం ప్రజల కళ్ళ ముందు పెట్టి, పార్టీని నేలమట్టం చేయడానికి పునాది వేశారు. చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ ఏ పొలిటికల్ సమావేశంలో జయంతి కి వర్ధంతి అని పలికి ఇప్పుడు ఏకంగా రాజకీయ జీవితానికే ఎండ్ కార్డు వేసుకున్నాడు తన చిన్న పిల్లల రాజకీయ చేష్టలతో.