అదేంటి అంత మాట అనేసారు.. మెగా కుటుంబం మాయల మరాఠి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు వీళ్లు చేస్తోన్న పనులు చూస్తుంటే ఇదే కరెక్ట్ టైటిల్. లేదంటే మరేంటి.. ఎప్పటికప్పుడు ఎవరికి వారే అన్నట్లుంటారు. కానీ అవసరం ఉన్నపుడు అంతా ఒక్కటైపోతారు. మెగా కుటుంబంలో విభేధాలు ఉన్నాయని..
పవన్ తో అల్లు కుటుంబానికి పడటం లేదని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతా ఒక్కటైపోయారు. అవసరం ఉన్నపుడు అన్ని బంధాలు బయటికి వచ్చాయి. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది.. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు మెగా కుంటుంబానికి ఇప్పుడు పక్కా సూట్ అవుతుంది.
ఇప్పుడు పవన్ చేస్తోన్న పోరాటానికి మెగా కుటుంబం అంతా అండగా నిలుస్తుంది.
నిన్నటికి నిన్న ఆయన ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి వచ్చినపుడు అందరి కంటే ముందు అక్కడ తేలిన వ్యక్తి అల్లుఅర్జున్. పవన్ పిలిస్తే వచ్చాడా లేదంటే నిజంగానే మద్దతు తెలపడానికి బాధ్యతగా వచ్చాడా అనేది తెలియదు కానీ.. వచ్చీ రాగానే పవన్ ను ఆప్యాయంగా కౌగిలించుకోవడం.. పవన్ కూడా బన్నీని దగ్గరికి తీసుకోవడం మాత్రం జరిగింది. పైగా అల్లు అరవింద్ కూడా పవన్ ను ఒక్క మాట అనగానే బయటికి వచ్చి ప్రెస్ మీట్ లో రచ్చ రచ్చ చేసాడు.
పైగా కేవలం పవన్ మొహం చూసి మాత్రమే ఇవన్నీ భరిస్తున్నాం అంటూ సింపుల్ గా వార్నింగ్ ఇచ్చాడు అల్లు అరవింద్. ఇదంతా చూస్తుంటే ఇప్పటికీ మెగా కుటుంబం అంతా ఒక్కటే అని అర్థమైపోతుంది. ఇదంతా చూసిన తర్వాత మెగా కుటుంబం మాయల మరాఠీ కాదంటారా..?