బాహుబలి తో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి కూడా తన నాలుగవ చిత్రమైన సై అపజయంగా నిలిచింది. భరత్ అనే నేను సక్సెస్ తో తెలుగు చలన చిత్ర చరిత్రలో వరుసగా నాలుగు సూపర్ హిట్స్ అందించిన ఘనత కొరటాల శివకే దక్కింది. అయితే సరిగ్గా గమనిస్తే ఈ నాలుగు చిత్రాలు ఒకే కథాంశం కలిగి ఉంటాయి.
తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ ఉండటం, తండ్రి నెరవేర్చలేని పనిని కొడుకు సాధించడం స్టోరీ లైన్ చుట్టూ అల్లిన కథలే మిర్చి గాని, శ్రీమంతుడు గాని, జనతా గారేజ్ గాని, ఇక ఇప్పుడు వచ్చిన భరత్ అనే నేను కూడా అంతే. అయితే బ్యాక్ డ్రాప్ చేంజ్ కావడం తో ఎవరు కనిపెట్టలేరు. ఒక సినిమా పల్నాడు బ్యాక్ డ్రాప్, ఒకటి విల్లెజ్ బ్యాక్ డ్రాప్, మరొకటి గారేజ్ బ్యాక్ డ్రాప్, ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్. శ్రీమంతుడు లో మహేష్ తన తండ్రైన జగపతి బాబు ఊరికి ఉపాహారం చేయబోయి అభాసుపాలవుతాడు…మహేష్ వెళ్లి ఊరిని ఉద్ధరిస్తాడు.
అలాగే జనతా గారేజ్ యన్ టీఆర్ తండ్రి చనిపోయిన కొన్నేళ్ళకు గారేజ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇక భరత్ అనే నేను విషయానికి కి వస్తే మహేష్ తన తండ్రి, ముఖ్యమంత్రి అయిన శరత్ కుమార్ ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు కాని చనిపోతాడు. మహేష్ సియం అయ్యి ఆ పనులను పూర్తిచేస్తాడు.
అంతే కాదు ఈ చిత్రాలన్నింటిలో తన ఆశయం కోసం చేసే పోరాటంలో గర్ల్ ఫ్రెండ్ తో విబేధాలు వచ్చి వదులుకోవలసి వస్తుంది. మిర్చిలో ప్రభాస్ అనుష్కకు దూరమవుతాడు, శ్రీమంతుడు లో తన ఊరికి ఏమి చేయని పారిశ్రామిక వేత్త కొడుకని తెలిసి శృతి హాసన్ మహేష్ ను దూరం పెడుతుంది. జనతా గారేజ్ లో సమంత ను వదులుకుంటారు యన్ టిఆర్ అలాగే భరత్ అనే నేను లో కూడా హీరోయిన్ కైరా అద్వానీ సీఎం అయిన మహేష్ వాళ్ళ అభాసుపాలై దూరంగా వెళ్ళిపోతుంది.
ఈ చిత్రాలన్నిటి కథ వెనుక కొరటాల శివ తన నిజ జీవితంలో ఫీలయ్యే ఎమోషనే అంటే ఆశ్చర్యం కలగక మానదు.
యస్, ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్తూ తనకు తండ్రి చిన్నతనం లోనే చనిపోయాడని, తండ్రి లేని లోటు తనకి తెలుసని, ఆయనతో గడప లేకపోయానని బాధపడుతుంటానని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఉండి ఉంటె మంచి పనులు చేసే వారని, ఆయన లేక పోవటంతో కొడుకుగా ఆ పనులు తాను చేస్తున్నట్లు అనుకుంటుంటాడట…ఈ ఊహలొనించి వచ్చిన కథలే మిర్చి, శ్రీమంతుడు, జనతా గారేజ్, భరత్ అనే నేను. మరి ఇక రాబోవు రామ్ చరణ్ తేజ్ చిత్రంలో తండ్రి కొడుకుల కథకు ఏ బ్యాక్ డ్రాప్ పెట్టనున్నారా కొరటాలకే ఎరుక!