రానా-తేజ ఓకే.. మ‌రి ఎన్టీఆర్..?


15 ఏళ్లుగా ఒక్క విజ‌యం కూడా లేని తేజ‌.. గ‌తేడాది నేనేరాజు నేనేమంత్రితో ఫామ్ లోకి వ‌చ్చాడు. ఆ సినిమా ఆడ‌గానే వెంట‌నే మ‌ళ్లీ మ‌నోడికి ఆఫ‌ర్ల వెల్లువ మొద‌లైంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే బాధ్య‌త‌ను తేజ చేతుల్లోనే పెట్టాడు బాల‌య్య‌. ఈ సినిమా కోస‌మే వెంక‌టేశ్ తో క‌మిటైన సినిమా కూడా వ‌దిలేసుకున్నాడు తేజ‌. ఇదిలా ఉంటే ఇప్పుడు బాల‌య్య సినిమాతో పాటే మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పాడు తేజ‌.
అదే రానాతో సినిమా. ఇదివ‌ర‌కు నేనేరాజు నేనేమంత్రితో హిట్టిచ్చిన ఈ జోడీ.. ఇప్పుడు మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నారు. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందనుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ కాన్సెప్ట్ తో ఘాజీ సినిమా చేసాడు రానా. ఇక ఇప్పుడు వ‌స్తోన్న మెహ‌బూబాలో కూడా 1971 ఇండో పాక్ వార్ ముచ్చ‌ట్లున్నాయి.
ఇప్పుడు రానా-తేజ మ‌రోసారి ఇదే చేయ‌బోతున్నారు. మ‌రి రానా సినిమా ఇప్పుడుంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ సంగ‌తేంటి..? మ‌రోవైపు బాల‌య్య కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ ఉండ‌గానే ఆగ‌స్ట్ నుంచి వినాయ‌క్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని చూస్తు న్నాడు. మ‌రి ఈ డ‌బుల్ డ్రామాల‌తో పాపం పెద్దాయ‌న‌ను ఏం చేస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here