అవునా.. ఏ విషయంలో ప్రభాస్ ను బన్నీ ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ఈ మధ్య ఆడియో వేడుకల్లో.. ప్రీ రిలీజ్ వేడుకల్లో సుత్తి తప్ప మరోటి ఏం కనిపించట్లేదు. రావడం.. తమ హీరో గురించి.. దర్శకుడి గురించి చిత్రయూనిట్ పొగడటం.. చివర్లో హీరో గురించి దర్శకుడు..
దర్శకుడి గురించి హీరో భజన చేయడం కామన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఫంక్షన్స్ అంటేనే ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దాంతో నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక చాలా డిఫెరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఎప్రిల్ 29న గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో జరగబోతుంది. దీనికి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. చిరంజీవి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు దర్శక నిర్మాతలు.
అయితే ఈయన ఎంట్రీపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ వేడుక రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎంట్రీ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ వేడుక కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఇందులో బన్నీ స్టేజ్ పైకి జిమ్నాస్టిక్స్ థీమ్ తో వస్తున్నాడని..
ఇందులో దేశభక్తి కూడా ఉంటుందని తెలుస్తుంది. గతంలో బాహుబలి 2 ఆడియో వేడుకలో ప్రభాస్ ను కూడా రోప్ కట్టి పై నుంచి దింపారు. అది అప్పట్లో బాగా హైలైట్ అయింది. ఇప్పుడు బన్నీ కూడా ఇలాంటిదే చేయబోతున్నాడు. మరి చూడాలిక.. ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు వారబ్బాయి చేయబోయే ఆ విద్యలు ఎలా ఉండబోతున్నాయో..?