మంచి సినిమాలు తెలుగులో చూస్తారా..? ఇక్కడ కమర్షియల్ హంగులు లేని సినిమాలు ఆడటం కష్టమేనా..? ఎప్పట్నుంచో తెలుగు ఇండస్ట్రీపై తమిళ వాళ్లకు ఉన్న అనుమానాలు ఇవి. కొన్నిసార్లు ఇది కరెక్టే అని ప్రూవ్ అవుతుంది. మరికొన్ని సార్లు మాత్రం తప్పవుతుంది. ఇప్పుడు కణం విషయంలో కరెక్టే అని ప్రూవ్ అయింది.
ఈ చిత్రానికి టాక్ చాలా బాగా వచ్చింది. సాయిపల్లవి నటన సినిమాకు అదనపు ఆకర్షణ. బ్రూణ హత్యల కాన్సెప్ట్ ను మనసుకు హత్తుకునేలా.. ఆలోచించేలా చూపించాడు దర్శకుడు విజయ్. నాగశౌర్య కూడా ఉన్నాడు సినిమాలో. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. పైగా గంట 41 నిమిషాల సినిమానే కావడంతో ప్రేక్షకులు దీనిపై ఆసక్తి చూపించడం లేదు. బాగుంది అనే టాక్ వచ్చిన తర్వాత కూడా కణం పుంజుకోవడం లేదు.
అదే తమిళ్ లో మాత్రం దియా అదరగొడుతుంది. అక్కడ కణం కాస్తా దియాగా రిలీజ్ అయింది. సాయిపల్లవి మ్యాజిక్ తో పాటు విజయ్ కు ఉన్న గుర్తింపు సినిమాకు ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తుంది. కానీ తెలుగులో మాత్రం కణం కేవలం ప్రశంసల దగ్గరే ఆగిపోయేలా కనిపిస్తుంది.