కాపు సామజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న మెసేజ్
కాపు సోదర , సోదరీమణులకు శుభోదయం.
ప్రస్తుత పరిస్థితుల్లో మన కాపు కులాన్ని ఏకీకృతం చేయటం అంటే ఇసుకనేలలో ఇల్లు కట్టటం లాంటి పని.
రంగా గారు ఉన్నప్పుడు మనకున్న పరిస్థితులు మంచి సారవంతమైన ఒండ్రు నేలలా ఉండేది , ఆయన మనకు దూరమైన తర్వాత ( మన ఎదుగుదల ఓర్వలేని కొన్ని అసాంఘిక శక్తులు మనకు ఆయన్ను దూరం చేశాయి) మనం సరైన పద్ధతి లో కులాన్ని ఏకీకృతం చేయకపోవడం వలన దురదృష్టవశాత్తు ఆ ఒండ్రు నేల కాస్తా మెల్లగా ఇసుకునేలగా మారిపోయింది.
ఈ మూడు దశాబ్దాల కాలంలో మనకు అందుబాటులో ఉన్న వనరులను ( ఇసుక నేలలోనే ) ఉపయోగించి చాలా మంది గుడిసెలు వేశారు. గుడిసెలు పర్మనెంట్ నిర్మాణం కాదు, ఎప్పుడైనా కూలిపోవచ్చు, కూల్చబడవచ్చు. రకరకాల పేర్లు ఉన్న గుడిసెలలోనే అదే అసాంఘిక శక్తులచే మనకాపులలో ఎక్కువ మంది చేవలేని, చేతకాని వాళ్లలా ముద్ర వేయించుకోబడ్డాము. మన బలాలు , సామర్థ్యాలు , కాన్ఫిడెన్స్ మనకే తెలియకుండా అత్యంత అవమానకరంగా అణిచివేయబడ్డాయి. .
ఇప్పటివరకు చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న మనకులానికి అత్యంత బలమైన పునాదితో బలంగా ధృఢంమైన ఒక పెద్ద కోటలాంటి నిర్మాణం అవసరం. సమయం ఇంకా మించిపోలేదు మనం మన శక్తి సామర్థ్యాలను ఒక్కొక్కటిగా , ఒక్కొక్కరం వెలికి తీసి అందరం కలిసి కాపులకు ఒక కంచుకోట కట్టుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది
ప్రస్తుతం ఇసుకునేల వంటి వనరులతో కంచుకోట కట్టుకివటం కష్టంతో కూడుకున్నదే కానీ సాధ్యమైనదే. రంగ గారు ఇచ్చిన స్పూర్తితో సాధించవచ్చు.
ఇసుకనేలలో దృఢమైన కోట కట్టాలంటే చాలా లోతుగా ఎర్రనేల తగిలేవరకు డ్రిల్ చేసి మన ఆర్థికాభివృద్ధికి, రాజ్యాధికారం అనే కోరికలు ( కాంక్రీట్) మిక్స్ చేసి దృఢమైన పునాది వేసుకొని, దాని మీద ఉక్కు ఉక్కునరాల కలిగిన మన యువత సంకల్పంతో సిమెంట్ దిమ్మెలు కట్టి , మధ్యవయసు ఉన్న వారి బలాన్ని ఇటుకలుగా పేర్చి ఒకనిర్మాణం తయారుచేయాలి.
ఆ తర్వాత పెద్దవారు , మేధావుల తెలివితేటలు , సూచనలు , అనుభవసారాంశాలతో కోటను నిర్మించుకుని మన అమ్మ అమ్మమ్మలతో, తోడబుట్టువలతో , ఆడబడుచులతో అందంగా అలంకరింపచేసిన ఆ కోట మన భావితరాల భవిష్యత్ కు భరోసా ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటున్నాం.
ఆ కోటకు ఒక రాజు ( నాయకుడు ) అవసరం. ఆ నాయకుడి కాపుకాసుకోవాలి , నిలబెట్టుకోవాలి.
రండి ఒకరితో మరొకరు కలుస్తూ , ఒక్కొక్క గుడిసెను ఏకం చేసుకుంటూ శత్రుదుర్భేద్యమిన కాపుల కంచుకోట నిర్మించుకుందాం.
కాపుల కోట ” సమాజానికి – సామాజిక సమూహాలను ” అన్నింటినీ కాపు కాచేది అవ్వాలని ఆశిద్దాము.