ఎప్పుడో కానీ రంగస్థలం లాంటి జన్యూన్ బ్లాక్ బస్టర్ రాదు. ఈ చిత్ర విజయంపై ఎవరికీ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఫేక్ కలెక్షన్లు అనే మాటే లేదు. తొలి షో నుంచే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. అదే స్థాయిలో సినిమాను ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. దాంతో రికార్డుల పరంపర సాగిస్తూనే ఉంది ఈ చిత్రం. ఐదో వారంలో కూడా రంగస్థలం షేర్ తీసుకొచ్చింది.. ఫుల్స్ సాధించిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే సినిమా 120 కోట్ల షేర్ అందుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 42 కోట్ల లాభాలు తీసుకొచ్చింది రంగస్థలం. ఇప్పట్లో ఈ సినిమాను దాటడం అంటే చిన్న విషయం కాదు. ఏ సినిమా అయినా ఈ రికార్డులను అందుకోవాలంటే తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో జనాల్లోకి వెళ్లాలి. లేకపోతే సిట్టిబాబును కనీసం టచ్ చేయడం కూడా కష్టమే. భరత్ అనే నేను కూడా అంతే. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే 57 కోట్ల షేర్ వసూలు చేసి..
రంగస్థలంను దాటేసింది. కానీ ఆ తర్వాత సిట్టిబాబు దూకుడు ముందు నిలబడలేకపోయాడు భరత్. తొలివారంలో రంగస్థలం 80 కోట్ల మార్క్ అందుకుని అన్నిచోట్లా సేఫ్ జోన్ కు వస్తే.. భరత్ అనే నేను మాత్రం 75 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్ లో రంగస్థలంను దాటడం మాట అటుంచితే ముందు అమ్మిన 100 కోట్లు వెనక్కి తీసుకొస్తే అదే మహాప్రసాదం అనుకుంటున్నారు బయ్యర్లు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క చోట కూడా సేఫ్ జోన్ కు రాలేదు ఈ చిత్రం. ఒక్క నైజాంలోనే 7 కోట్ల బాకీ ఉంది. మే 4న నా పేరు సూర్య వస్తుంది. ఇది కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే భరత్ ఫ్లాప్ లిస్ట్ లో మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..?